రీమేక్ సినిమాలపై దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్.? ఎవరి సినిమా అయినా.!
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం ‘కింగ్ ఆఫ్ కోత’ చిత్ర ప్రమోషన్స్ లో ఉన్నారు. ఈ సందర్భంగా రీమేక్ సినిమాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
మలయాళం యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) విభిన్న పాత్రలు పోషిస్తూ అలరిస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. మలయాళంతో పాటు హిందీ, తమిళం, తెలుగులోనూ చిత్రాలు చేస్తూ ప్రేక్షకాదరణ పొందుతున్నారు. తెలుగులో గతేడాది ‘సీతారామం’తో దుల్కర్ సల్మాన్ భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మలయాళంలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను పూర్తి చేశారు.
మలయాళంలో ‘కింగ్ ఆఫ్ కోత’గా రూపుదిద్దుకున్న చిత్రంలో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్ లో నటించారు. అభిలాష్ జోషి దర్శకత్వం వహించారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీ ఆగస్టు 24న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా యూనిట్ మూవీ ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తోంది. ఈక్రమంలో దుల్కర్ సల్మాన్ ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
అయితే, తాజా ఇంటర్వ్యూలో దుల్కర్ కు రీమేక్ సినిమాలపై ప్రశ్న ఎదురైంది. మీరు రీమేక్ సినిమాలు చేస్తారా? మీ నాన్న గారి సినిమాల్లో ఏదైనా చేసే అవకాశం ఉందా? అంటూ ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా బదులిచ్చారు. దుల్కర్ మాట్లాడుతూ.. రీమేక్ సినిమాలు చేసే ఛాన్స్ లేదు. మా నాన్న సినిమాలని కాదు.. ఏ సినిమాను రీమేక్ చేయబోనని స్పష్టం చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ లాంటి ఇండస్ట్రీలో బడా హీరోలు రీమేక్ చేస్తూ హిట్లు కోడుతున్న తరుణంలో దుల్కర్ చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి.
ఇక దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కోత’ మూవీతో పాటు ఓ క్రేజీ సిరీస్ లోనూ నటిస్తున్నారు. ప్రముఖ దర్శకద్వయంలో హిందీలో రూపుదిద్దుకుంటున్న ‘గన్స్ అండ్ గులాబ్స్’ సిరీస్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కూడా ముగిసినట్టు తెలుస్తోంది. ఇది కూడా ఆగస్టు 18 నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.