కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన కోసం అభిమానులు పడిగాపులు కాస్తుంటారు. ఆయన బయట ఎక్కడ కనిపించినా.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి.

అభిమానులు తనకోసం అనవసరంగా డబ్బు, సమయం వృధా చేసుకుంటున్నారని అజిత్.. తన అభిమాన సంఘాన్ని కూడా రద్దు చేశారు. అయినప్పటికీ ఆయన అభిమానులు మాత్రం ఆయన కోసం ఎదురుచూస్తుంటే ఉంటారు. సినిమా ప్రమోషన్స్ కి, పూజా కార్యక్రమాలకు కూడా అజిత్ రాకపోవడంతో ఆయనపై ఇంకా అభిమానం పెరగడంతో పాటు ఆయన్ని చూడాలనే ఆసక్తి రెట్టింపు అవుతోంది.

ఇది ఇలా ఉండగా.. డబ్బింగ్ చెప్పడానికి కూడా అజిత్ తన ఇంట్లోనే వసతిని ఏర్పాటు చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన ఇంట్లోనే సొంతంగా ఓ డబ్బింగ్ థియేటర్ ని నిర్మిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇకపై అజిత్ సినిమాల డబ్బింగ్ పనులన్నీ తన ఇంట్లోనే జరుగుతాయని చెబుతున్నారు. ఇటీవల అజిత్ నటించిన 'నేర్కొండ పార్వై' సినిమా రిలీజై సక్సెస్ అందుకుంది.