టాలీవుడ్ రాకింగ్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా సినిమా చేయబోతున్నట్లు గత కొంత కాలంగా అనేక కథనాలు వెలువడుతోన్న సంగతి తెలిసిందే. సంగీత దర్శకుడిగా ఎన్నో ప్రయోగాలతో యువతకు బాగా దగ్గరైన ఈ రాకింగ్ స్టార్ దాదాపు టాలీవుడ్ హీరోలందరితో వర్క్ చేశాడు. 

అయితే డిఎస్పీ ఇన్ని రోజులు యాక్టింగ్ డెబ్యూ పై పెద్దగా స్పందించలేదు. ఫైనల్ గా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ ఇచ్చాడు. చాలా కాలంగా ఎన్నో కథలు తన దగ్గరకు వస్తున్నాయని చెప్పాడు;. అ స్క్రిప్ట్స్ కూడా దేవికి కరెక్ట్ గా సెట్టయ్యే విధంగా మంచి ఎనర్జీటిక్ గా ఉన్నాయట. అయితే దేవికి మాత్రం హాలీవుడ్ మ్యూజికల్స్ తరహాలో మంచి స్క్రిప్ట్ దొరికితే బావుంటుందని అంటున్నాడు. 

మొదటి సినిమా మ్యూజికల్ బ్యాక్ గ్రౌండ్ తో సాలిడ్ గా ఉండాలని దేవి కోరుకుంటున్నట్లు చెప్పాడు. దేవి చెప్పిన విషయాల్ని బట్టి ఇంకా ఎలాంటి స్క్రిప్ట్ ను ఒకే చేయలేదని అర్ధమవుతోంది. అయితే ఫ్యూచర్ లో మాత్రం దేవి హీరోగా మరిన్ని సినిమాలతో రానున్నాడని చెప్పవచ్చు. ఇక అందులో మొదటి సినిమా సుకుమార్ కాంపౌండ్ నుంచే ఉంటుందని టాక్.