ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా తారల పెళ్లిళ్లు.. చేసుకుంటున్నారు.. వెంటనేపిల్లలు కనేస్తున్నారు.  బుల్లితెర తారలు, వెండితెర సెలబ్రిటీలు..బేబీ బంప్ ఫోటోలతో  సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు తాజాగా తాజాగా మరో నటి బేబి బంప్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. 

ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి.. వెంటనే పిల్లల్ని కూడా కనేస్తూ.. సూపర్ ఫాస్ట్ గా ఉన్నారు సెలబ్రిటీలు. బెబీబంప్ ఫోటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు స్టార్స్.. ఈక్రమంలో.. తాజాగా మరో నటి బేబీ బంప్ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందీ దృశ్యం సినిమాతో పాపులర్ అయిన ఇషితా దత్తా ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లుకొడుతున్నాయి. 

 ఇషితా దత్తా.. 2012 లో వచ్చిన చాణక్యుడు సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. కాని ఇక్కడ పెద్దగా సినిమాలు చేయలేదు. బాలీవుడ్ దృశ్యం సినిమాలో అజయ్ దేవ్‌గణ్ కూతురుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. మలయాళం బ్లాక్ బస్టర్ రీమేక్ దృశ్యం తమిళం, తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లో డబ్ అవగా.. హిందీలో ఇషితా తన నటనతో మెప్పించింది.. అలాగే 2022 లో వచ్చిన సీక్వెల్ దృశ్యం 2 లో కూడా నటించి దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది..

ఇక తాజాగా ఇషితా గురించి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతోంది.. త్వరలో ఇషితా తల్లికాబోతోందని తెలుస్తోంది. ఈ విషయం అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా..ఇషితా బేబి బంప్‌తో వీడియో తో పాటు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమధ్య ఇషితా ముంబయి ఎయిర్ పోర్ట్‌లో కెమెరాల కంట పడింది.. ఆ సమయంలో ఆమె బేబీ బంప్ తో ఉంది. దాంతో ఆమె ప్రెగ్నెంట్‌ అని రివిల్ అయ్యింది. ఇక 2017 లో ఇషితా... వత్సల్ సేథ్‌ను పెళ్ళి చేసుకుంది. 

ఇషితా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఆమె కానీ ఆమె భర్త వత్సల్ కానీ ప్రకటించలేదు. తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో కూడా ఈ విషయం గురించి పోస్ట్ చేయలేదు. అటుఫ్యాన్స్ కు కూడా వైరల్ అవుతున్న ఈ వీడియో ద్వారానే తెలిసింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్.. ఇషితా దత్తాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. మరి ఈ విషయంలో ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.