Asianet News TeluguAsianet News Telugu

అసౌకర్యానికి చింతిస్తున్నాం :‘దృశ్యం 2’టీమ్ .! బద్దకం అంటూ కౌంటర్లు

ఈ చిత్రానికి సీక్వెల్‌గా దృశ్యం2 వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాను మలయాళంలో కేవలం 45 రోజుల్లోనే తీశాడు దర్శకుడు జీతూ జోసెఫ్. థియేటర్స్ జోలికి వెళ్లకుండా ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల చేశారు.
 

Drushyam 2 update delayed by team
Author
Hyderabad, First Published Sep 20, 2021, 11:31 AM IST

మలయాళంలో వచ్చిన 'దృశ్యం' అక్కడ కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత  ఈ సినిమా రీమేక్ అయిన అన్ని భాషల్లోను సక్సెస్ ను సొంతం చేసుకుంది. అలా తెలుగులోనూ ఈ కథకు భారీ సక్సెస్ దక్కింది. ఇక ఈ మధ్య మళయాళంలో వచ్చిన ఈ సినిమా సీక్వెల్ కి అనూహ్యమైన స్పందన లభించింది. దాంతో తెలుగులోనూ ఈ సీక్వెల్ కి రీమేక్ చేశారు. మళయాంలో ఈ సీక్వెల్ ని ఓటీటిలో రిలీజ్ చేసారు. 

ఈ సినిమాను మలయాళంలో కేవలం 45 రోజుల్లోనే తీశాడు దర్శకుడు జీతూ జోసెఫ్. థియేటర్స్ జోలికి వెళ్లకుండా ఫిబ్రవరి 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదల చేశారు. అయితే తెలుగులో రీమేక్ అవుతున్న దృశ్యం 2 కూడా ఓటీటీ వేదికగానే విడుదలవుతుందని గత కోడి రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి చెందిన ఒక ప్రముఖ సంస్థవారు భారీ ఆఫర్ ఇవ్వడంతో నిర్మాతలు అంగీకరించారనీ, అందువలన ఈ సినిమా ఓటీటీ ద్వారానే రానుందనే టాక్ ఊపందుకుంది. దాంతో సురేశ్ బాబు స్పందిస్తూ .. ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని తేల్చేశారు. ఏ విషయమైనా తామే స్వయంగా చెప్పేవరకూ ప్రచారాలు నమ్మవద్దని స్పష్టం చేశారు.
 
అయితే వెంకటేష్  నారప్ప చిత్రాన్ని ఓటిటిలో రిలీజ్ చేయటం కూడా అందరిలో అనుమానాలు మొదలయ్యాయి.దాంతో  ఈ సినిమా థియేటర్లకు వస్తుందా? ఓటీటీకి వెళుతుందా? అనే డిస్కషన్ మీడియాలో మొదలయ్యింది.  ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్టులుక్ రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 20వ తేదీ అంచే  ఈ రోజు ఉదయం 10:08 నిమిషాలకు ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. అలాగే మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. కానీ  దీనిపైనే వారు ఓ బ్యాడ్ న్యూస్ ని వెల్లడించారు. 

“కొన్ని అనుకోని ఊహించని పరిణామాల రీత్యా ఈరోజు రిలీజ్ చేస్తామన్న దృశ్యం 2 ఫస్ట్ లుక్ పోస్టర్ ని వాయిదా వేస్తున్నామని, ఈ అసౌకర్యానికి చింతున్నామని” అభిమానులకు సారీ చెప్పారు. ఈ ట్వీట్ కు జనాలు రిప్లై ఇస్తున్నారు. ఫస్ట్ లుక్ వదలటానికి కూడా బద్దకం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అదేమన్నా కష్టమైనా పనా అంటున్నారు. లేజీ ప్రొడక్షన్ హౌస్ అని విమర్శిస్తున్నారు.

మరి ఈ అప్డేట్ ఎప్పుడు వస్తుందో అన్నది చూడాలి.  సురేష్ ప్రొడక్షన్స్ మరియు ఆశీర్వాద్ సినిమాస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే. ఏదైమైనా విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో సీనియర్ హీరో వెంకటేష్ ఎప్పుడు ముందుంటారు. మల్టీస్టారర్ సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీగా నటిస్తున్నారు వెంకీ.ఈ సినిమాతోపాటు ఎఫ్ 3 సినిమా చేస్తున్నాడు వెంకీ.  

Follow Us:
Download App:
  • android
  • ios