బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా కౌశల్ నిలిచాడు. సింగర్ గీతా మాధురి, కౌశల్ ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. కౌశల్ ఆర్మీ అండతో బిగ్ బాస్ 2 టైటిల్ ఎగరేసుకుపోయాడు. కౌశల్ ఆర్మీ నుంచి ఇతడికి లభించిన మద్దతు అంతా ఇంతా కాదు. ఇదిలా ఉండగా కౌశల్ తాజాగా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.

కౌశల్ ఆర్మీ పేరుని కానీ, తన పేరుని కానీ బిగ్ బాస్ 3 కోసం ఎవరూ ఉపయోగించవద్దు. ఇది నా వార్నింగ్. ఇంటర్వ్యూలలో కూడా నా పేరు ఉపయోగించవద్దు అని కౌశల్ కోరాడు. ఇప్పటికే సోషల్ మీడియాలో శ్రీముఖిఆర్మీ పేరుతో భీభత్సం మొదలయింది. బిగ్ బాస్ 2లో కొన్ని రోజుల తర్వాత కౌశల్ కు మద్దతుగా కౌశల్ ఆర్మీ ఏర్పడింది. 

కానీ శ్రీముఖి కోసం బిగ్ బాస్ 3 ఆరంభం నుంచే ఓ ఆర్మీని ఏర్పాటు చేసేశారు. వీళ్ళ భీభత్సం ఏ స్థాయికి చేరుతుందో అనే చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ సీజన్ 3ని ఆరంభం నుంచే ఆసక్తిగా ఉండేలా నిర్వాహకులు ప్లాన్ చేశారు. గతః సీజన్ లో కౌశల్ ఆర్మీ వల్ల అనేక వివాదాలు కూడా వచ్చాయి. బాబు గోగినేని లాంటి సెలెబ్రిటీలు కౌశల్ విజేత కావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు.