Asianet News TeluguAsianet News Telugu

`డాన్‌ 3` ప్రకటన.. షారూఖ్‌ స్థానంలో రణ్‌వీర్‌ సింగ్‌..

షారూఖ్‌ ఖాన్‌ హీరోగా నటించిన `డాన్‌` మూవీస్‌ హిందీలో ఎంతటి విజయాన్ని సాధించాయో తెలిసిందే. తాజాగా మూడో భాగం రాబోతుంది. `డాన్‌ 3`ని ప్రకటించారు. 

don3 movie with ranveer singh arj
Author
First Published Aug 9, 2023, 12:07 PM IST

బాలీవుడ్‌ హిట్‌ ఫ్రాంచైజీగా నిలిచింది `డాన్‌` మూవీ. షారూఖ్‌ ఖాన్‌ హీరోగా ఫరాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. `డాన్‌`, `డాన్‌ 2` చిత్రాలు వచ్చి బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. స్టయిలీష్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా మెప్పించాయి. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో మరో సీక్వెల్‌ రాబోతుంది. తాజాగా `డాన్‌ 3`ని ప్రకటించింది యూనిట్‌. 

అయితే ఇందులో షారూఖ్‌ స్థానంలో రణ్‌బీర్‌ సింగ్‌ హీరోగా నటిస్తుండటం విశేషం. రణ్‌వీర్‌ సింగ్‌ ట్విట్టర్‌ ద్వారా దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్‌ వీడియోని పంచుకున్నారు. స్టయిలీష్‌ లుక్‌లో, బుల్లెట్‌ వదులుతూ ప్రకటించిన ఈ వీడియో ఆకట్టుకుంటుంది. వైరల్‌ అవుతుంది. షారూఖ్‌ స్థానంలో రణ్‌వీర్‌ చేరడంతో ఈ ఫ్రాంచైజీ లెక్కలు మారిపోతున్నాయని చెప్పొచ్చు. కొత్త ఎర బిగిన్‌ అంటూ దీన్ని రిలీజ్‌ చేసింది.  

ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వం వహించే ఈచిత్రాన్ని ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రితేష్‌ సిద్వానీ, ఫర్హాన్‌ అక్తర్‌ నిర్మిస్తున్నారు. 2025లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది యూనిట్‌. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. మరి షారూఖ్‌ రేంజ్‌లో రణ్‌వీర్‌ సింగ్‌ మెప్పిస్తాడా? అనేది చూడాలి. ఆ రేంజ్‌ హిట్‌ సాధ్యమవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. 

రణ్‌వీర్‌ సింగ్‌ ఇటీవల `రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహాని` చిత్రంలో నటించారు. అలియా భట్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. మరోవైపు ఫర్హాన్‌ `డాన్‌ 2` తర్వాత ప్రస్తుతం `జీ లే జరా` చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతోపాటు `డాన్‌ 3`ని డైరెక్ట్ చేయబోతున్నారు. నటుడిగా ఆయన ప్రస్తుతం `ఫక్రీ 3`లో నటిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios