Asianet News TeluguAsianet News Telugu

'ఉస్తాద్'​ టీజర్‌ 'గాజు గ్లాస్‌' డైలాగ్స్‌పై ఈసీ ఏమందంటే...!

రాష్ట్ర ఎన్నిక‌ల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఎన్నిక‌ల ప్రవ‌ర్తనా నియ‌మావ‌ళి అమ‌లుపై ఎప్పటిక‌ప్పుడు కీల‌క సూచ‌న‌లు చేస్తూ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేస్తున్నారు. 

Does Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Need EC Permission jsp
Author
First Published Mar 21, 2024, 9:50 AM IST


 పవన్ కళ్యాణ్ హీరోగా  బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar)  దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh).రీసెంట్ గా ఈ చిత్రం టీజర్ రిలీజైంది. ఈ టీజర్ పొలిటికల్ గా ఉందనేది నిజం.  ఈ టీజర్‌లో పవన్‌కి విలన్స్‌కి మధ్య గాజు గ్లాసు సెంట్రిక్‌గానే డైలాగ్స్ నడిచాయి. ఈ టీజర్‌ ఎలక్షన్ పబ్లిసిటీలా ఉందని, తమ దృష్టికి వచ్చిన విషయంపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్ మీనా స్పందించారు.

ముఖేష్ కుమార్ మాట్లాడుతూ.. ఇంకా టీజర్ చూడలేదన్నారు. చూసిన తర్వాత అది ఎలక్షన్ పబ్లిసిటీలా ఉందో లేదో చూసి డిసైడ్ చేస్తామన్నారు. ఒకవేళ పొలిటికల్ పబ్లిసిటీ అనిపిస్తే ముందుగా పర్మిషన్ ఎందుకు తీసుకోలేదో ఆరా తీస్తామన్నారు. టీవీల్లో, పేప‌ర్లలో వ‌చ్చే ప్రక‌ట‌న‌ల‌కు త‌ప్పనిస‌రిగా ఈసీ అనుమ‌తి తీసుకోవాల‌ని సూచించారు సీఈవో. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాలో పొలిటిక‌ల్ కంటెంట్ ఉంటే ఎన్నిక‌ల క‌మిష‌న్ అనుమ‌తి త‌ప్పనిస‌రిగా తీసుకోవాల‌ని మీనా చెప్పారు. టీజ‌ర్ పై ఎవ‌రైనా ఫిర్యాదు చేసినా లేకుంటే మేము స్వయంగా చూసినా దానిపై నిర్ణయం తీసుకుంటామ‌ని సీఈవో చెప్పారు.   మరోవైపు.. ఈ టీజర్‌లో గ్లాస్‌ సీన్‌పై స్పందించారు పవన్. తనకు ఏమాత్రం ఆసక్తి లేకపోయినా కేవలం డైరెక్టర్ చెప్పిన కారణంగానే ఈ సీన్‌లో యాక్ట్ చేశానన్నారు.

రాష్ట్ర ఎన్నిక‌ల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఎన్నిక‌ల ప్రవ‌ర్తనా నియ‌మావ‌ళి అమ‌లుపై ఎప్పటిక‌ప్పుడు కీల‌క సూచ‌న‌లు చేస్తూ అధికారుల‌కు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మార్చి 16వ తేదీన ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల అయిన వెంట‌నే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఎన్నికల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత ప్రభుత్వ స్థలాల్లో 1.99 లక్షల హోర్డింగులు, ప్రైవేట్ స్థలాల్లో 1.15 లక్షల హోర్డింగులు తొల‌గించిన‌ట్లు రాష్ట్ర ఎన్నిక‌ల ప్రధానాధికారి మీనా తెలిపారు. 

 ఇక  ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం.. దళపతి విజయ్, అట్లీ కాంబోలో వచ్చిన ‘తెరి’కి రీమేక్ అని ప్రచారం జరిగింది. దీనిపై దర్శకుడు హరీశ్​ను క్లారిటీ ఇవ్వటానికి ఇష్టపడలేదు. అయితే ఓ  ఇంట‌ర్వ్యూలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం రైట‌ర్‌గా మారిన డైరెక్ట‌ర్ ద‌శ‌ర‌థ్ స్పందిస్తూ.. ‘‘‘తెరి’ సినిమా స్టోరీ లైన్‌ను మాత్ర‌మే తీసుకుని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను చేస్తున్నారు హరీష్ శంక‌ర్‌. ప‌ది శాతం క‌థ‌ను మాత్ర‌మే తీసుకున్నాం. మిగ‌తా తొంబై శాతం సినిమా క‌థ‌ను హ‌రీష్ త‌న‌దైన స్టైల్లో మార్చేశారు. రీసెంట్‌గా వ‌చ్చిన టీజ‌ర్ చూస్తే మీకు ఆ విష‌యం అర్థ‌మవుతుంది’’ అన్నారు. 

‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఇద్ద‌రు హీరోయిన్స్ న‌టిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో శ్రీలీల క‌నిపించ‌నుంది. మ‌రో హీరోయిన్‌గా అఖిల్ స‌ర‌స‌న ఏజెంట్ సినిమాలో న‌టించిన సాక్షి వైద్య క‌నిపించ‌నుంది.  పోలీస్ డ్రామాగా సినిమా రూపొందుతున్న  ఈ చిత్రానికి రాక్​ స్టార్​ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios