కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే చిత్రంతో చాలా బిజీగా ఉన్నాడు. ఎమ్మెల్యే చిత్రం మార్చి 23 న విడుదలకు సిద్ధం అవుతోంది. నా నువ్వే చిత్రం కూడా ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. గత కొంతకాలంగా కళ్యాణ్ రామ్ ఈ రెండు చిత్రాలతో తీరిక లేకుండా గడిపిన సంగతి తెలిసిందే. కాగా ఎమ్మెల్యే చిత్ర షూటింగ్ లో కళ్యాణ్ రామ్ గాయపడ్డాడు. కళ్యాణ్ రామ్ కుడి మోచేతికి గాయమైంది. కానీ సినిమా వేసవికి విడుదల కావలసి ఉండడంతో కళ్యాణ్ రామ్ నొప్పిని భరిస్తూ కమిట్ మెంట్ తో పనిచేసాడు.


తాజాగా కళ్యాణ్ రామ్ కు మోచేతి నొప్పి తీవ్రమైనట్లు తెలుస్తోంది. డాక్టర్లు నెల మొత్తం పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని సూచించారట. ఎమ్మెల్యే చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే చిత్ర ట్రైలర్ శుక్రవారం విడుదలై అలరిస్తోంది. ఈ చిత్రం తరువాత నా నువ్వే చిత్రంతో కళ్యాణ్ రామ్ బిజీకాబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం కూడా విడుదలకు సిద్ధం అవుతోంది.