స్టార్స్ ఏమి తింటారు?. ఎలా ఉంటారు? వాళ్ళ దిన చర్య ఏమిటీ? ఇలాంటి విషయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. తమ అభిమాన తార డైలీ లైఫ్ గురించి తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. ఈ విషయాలన్నీ షేర్ చేస్తూ ఓ ఇంట్రెస్టింగ్ వీడియో చేశారు దీపిక పదుకొనె. ఆ వీడియో తన సోషల్ మీడియా అకౌంట్ లో పంచుకోగా వైరల్ అవుతుంది.

సదరు వీడియోలో ఒకరు మీ డైలీ దిన చర్య ఏమిటని అడుగగా.... ఇది చెప్పడం కొంచెం కష్టమే, ఎందుకంటే ఏ రెండు రోజులు ఒకలా ఉండవు. ఉదయాన్నే నిద్ర లేవడం, బ్రష్ చేయడం, వ్యాయామం వంటివి రెగ్యులర్ గా చేస్తాను. అని అన్నారు దీపికా.

రెండవ ప్రశ్నగా మీరు అన్ని విషయాలు ప్రణాళిక ప్రకారం చేస్తారా? అని అడుగగా... దీనికి అవును అలాగే కాదు అని చెప్పాలి. కొన్ని విషయాలు ప్లాన్ ప్రకారం చేస్తాను, కొన్ని మాత్రం అలా ఫ్లోలో జరిగిపోతాయి అన్నారు. దీపికా ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు.

ఇక బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఉన్న దీపిక క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటున్నారు. భర్త రన్వీర్ సింగ్ నటిస్తున్న 83 మూవీలో దీపిక హీరోయిన్ గా నటిస్తున్నారు. కపిల్ బయోపిక్ గా తెరకెక్కుతున్న 83లో కపిల్ భార్య రోల్ చేస్తున్నారు ఆమె. అలాగే ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న చిత్రంలో దీపిక హీరోయిన్ గా ఎంపికయ్యారు.