ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి (Bappi Lahiri) మరణ వార్తను సినీ ప్రముఖులు, అభిమానులు   జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే బప్పికి బంగారం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఎప్పుడూ ఒంటి నిండా బంగారంతోనే కనిపించేవాడు. 

బస్పి లహిరీ అసలు పేరు అలోకేశ్‌ లహిరి. బాలీవుడ్‌కు డిస్కో మ్యూజిక్‌ను పరిచయం చేసిన లెజెండరీ సింగర్‌ అతను. తన గానంతో మెస్మరైజ్‌ చేసిన బప్పి లహరి పాటలతోనే కాకుండా ప్రత్యేకమైన ఆహార్యంతోనూ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. చేతి వేళ్లకు గోల్డ్‌ రింగ్స్‌, నల్లని కళ్లద్దాలు, మెడలో కిలోల కొద్దీ బంగారు గొలుసులు ఎప్పుడూ ఆయనవెంటే ఉంటాయి. అంతబంగారం ఒంటిపైనే ధరించి ఉండటానికి గల కారణాలు, వాటికి ఉన్న ప్రత్యేకత, వాటిని ఇప్పుడు ఏం చేయబోతున్నారనే సందేహం పలువురిలో కలిగింది.

వయసు దాటినా ఎప్పుడూ తరగని ఉత్సాహం, చెరగని చిరునవ్వుతో కనిపించే బప్పీలహరి బంగారం లేకుండా అసలు కనిపించేవారు కాదు. ఆయనకు బంగారం అంటే అంత ఇష్టం మరి. `గోల్డ్ ఈజ్ మై గాడ్‌` అంటుండేవారాయ‌న‌. ఆయ‌న మెడ‌లో ఎప్పుడూ బంగారు ఆభ‌ర‌ణాలు మెరుస్తూ ఉండేవి. బప్పిలహరికి బంగారంపై ఎందుకంత ప్రేమ అనే సందేహంతో దీని వెనుకున్న సీక్రెట్‌ ఏంటి అని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా..

ఆయన స్పందిస్తూ.. హాలీవుడ్‌ కు చెందిన ఓ పాప్‌ సింగర్‌ను చూశాక తనకు బంగారం మీద ప్రేమ పెరిగిందని చెప్పాడు. మరోవైపు బంగారాన్ని తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే సాధానంగా చెప్పారు. 'ఓ సాంగ్‌ రికార్డింగ్‌ సమయంలో దేవుడి బొమ్మ ఉన్న ఓ లాకెట్‌ను వాళ్ల అమ్మ తనకు బహుమతిగా ఇచ్చిందట.. పెళ్లయ్యాక కూడా నా భార్య ఓ గణపతి లాకెట్‌ కూడిన బంగారు గొలుసును ఇచ్చిందని తెలిపారు. తన మెడలోని గణపతి నన్ను ఎప్పుడూ రక్షిస్తాడని చెప్పారు. 

అయితే తన ఒంటిపై మొత్తం 754 గ్రాముల బంగారు ఆభరణాలు, 4.62 కేజీ వెండి ఆభరణాలను ధరిస్తాడు. వీటి విలువ సూమారు రూ.30 లక్షలకు పైగా ఉంటుంది. అయితే ఈబంగారాన్ని ఎప్పుడూ తన వెంటనే ఉంచుకునే వాడు బప్పి. ‘గోల్డ్ ఈస్ మై గాడ్’ అని నమ్మే బప్పి లహిరి వాటిని తానే శుభ్రపరిచుకునే వాడంట. వాటిని దైవంతో సమానంగా భావించేవాడంట. అంతేకాకుండా తన కెరీర్‌ ఎదుగుతున్న కొద్దీ బంగారం మరింత రెట్టింపయ్యింది' అని ఆయన పేర్కొన్నారు.

బంగారంపై బప్పి లహిరికి ఎంతో మక్కువ. అయితే బంగారంపై అతని ప్రేమకు పరిమితి లేదు. ఒక పాట లేదా ఆల్బమ్ విజయం సాధించిన తర్వాత బప్పి రాయల్టీ సంపాదన నుండి బంగారం కొనుగోలు చేసేందుకు కొంత ఖర్చు చేసేవాడు. మరోవైపు అతనికి పలువురి నుంచి వచ్చే బహుమతులు కూడా ఎక్కువగా గోల్డ్ సంబంధించే ఉంటాయట. అయితే తన బంగారు ఆభరణాలను ఎవరినీ తాకనిచ్చే వారు కాదంట. కొద్దో గొప్పో తన ప్రత్యేక సహాకుడు మాత్రం వాటిని ఒకపెట్టే పెట్టేంత వరకు బాధ్యత తీసుకునేవాడని ఆయనే తెలిపారు.

ఆయన మరణనానంతరం ఆ బంగారు గొలుసులు, లాకెట్లు, ఉంగరాలు, కంకణాలు, గణేశుడి విగ్రహాలు, వజ్రాలు పొదిగిన ఆకర్షణీయమైన కంకణాలు, బంగారు ఫ్రేమ్‌లు, బంగారు కఫ్‌లింక్‌లను ఆయన పిల్లలు బప్పా, రెమా వాటిని ఒక పెట్టేలో భద్రపరిచారు. తన తండ్రి సంపాదించిన వస్తువులను, ప్రత్యేక గోల్డ్ సంబంధింత వస్తువులను ఆయన గుర్తుగానే అలాగే భద్రంగా ఉంచనున్నట్టు సమాచారం.