బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ (Anushka Sharma) కోవిడ్ 19 కారణంగా విధించిన మొదటి దశ లాక్ డౌన్ లో ఏం  చేసిందో తెలియజేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా తన అభిమానులతో పంచుకుంది. మరో ఫొటోను పంచుకుంటూ తనకు ‘కాఫీ’ అంటే ఎంత ఇష్టమో తెలిపింది. మరోవైపు ట్విట్టర్ సీఈవో పరాగ్ ను ప్రశంసించింది. 

ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (Virat Kohli) భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ అటు కేరీర్.. ఇటు లైఫ్ లోనూ చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఏ పనిచేసినా ఆచితూచీ అడుగేస్తోంది. అయితే కరోనా (Covid 19) కారణంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన మొదటి దశ లాక్ డౌన్ వల్ల ప్రజలంతా ఇంటి పట్టునే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలోనూ షూటింగ్ లు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో సెలబ్రెటీలు ఇంట్లోనే కాలం గడపాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఒక్కో సెలెబ్రెటీ ఒక్కో శైలిలో తమ లాక్ డౌన్ రోజులను దాటుకొచ్చారు.

అయితే బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ లాక్ డౌన్ లో ఏం చేసిందో తెలియజేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియలో పోస్ట్ చేస్తూ తన అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో ‘ఇంట్లోనే ఉంటున్న అనుష్క శర్మ.. ఫుడ్ మేకింగ్ బ్లాగ్ లను ఎక్కువగా ఫాలో అయ్యేదంట. అయితే తన కూడా ఏదైనా వంటకంతో వీడియో షూట్ చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకు జామ్ మేకింగ్ వీడియోను షూట్ చేసింది. టామాటో, ఇతర ఇంగ్రిడెంట్స్ తో జామ్ తయారు చేసి తల్లిదండ్రులకు సర్వ్ చేసింది. రుచి చూసిన వారు అనుష్కను ప్రశంసించారు.’ ఈ విషయన్ని చూడవచ్చు. అయితే 2021 నాటిని కరోనా పోవాలని ఆశించిందంట. కానీ ఇంకా దాని ప్రభావం ఉన్నందున మరోసారి ఆ వీడియో ద్వారా అప్పటి రోజులను గుర్తు చేసుకుంది. 

View post on Instagram

ప్రస్తుతం త్రో బ్యాక్ పిక్చర్స్ హవా కొనసాగుతోంది. ఇందులో భాగంగా అనుష్క శర్మ తన పాత ఫొటోను షేర్ చేసింది. అయితే ఈ ఫొటోలో అనుష్క ఒక కుర్చీలో కూర్చొని ఉంటుంది. తన ముందున్న టేబుల్ పై రెండు కాఫీ కప్పులు, ఒక సన్ గ్లాసెస్ ఉంది.’ ఈ ఫొటోను వివరిస్తూ క్యాప్షన్ కూడా యాడ్ చేసింది. ‘ఆ సమయానికి నేను ఒకటి కాదు రెండు కప్పుల ‘హాట్’ కాఫీని ప్రశాంతంగా తాగాను. అంతేకాకుండా ఫోన్‌ను కూడా ఆపరేట్ చేశాను’ అంటూ కాఫీ అంటే తనకెంత ఇష్టమో తన అభిమానులకు తెలిపింది. 

తాజాగా, ట్విట్టర్ సీఈవో పరాగ్ ( Twitter CEO Parag)ను అనుష్క శర్మ ప్రశంసించింది. రెండో బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్న పరాగ్ అగర్వాల్ తన బిడ్డకు సమయం ఇచ్చేందుకు కొన్ని రోజులు సెలవు తీసుకున్నాడు. పిల్లల సంరక్షణపై పరాగ్ సెలవు తీసుకోవడం పట్ల అనుష్క శర్మ సంతోషం వ్యక్తం చేసింది. పరాగ్ నిర్ణయాన్ని ప్రశంసించింది.