Asianet News TeluguAsianet News Telugu

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ రెమ్యూనరేషన్ తెలుసా... హీరోలను మించి పోయాడుగా!

దేవిశ్రీ సంగీతం అందించని స్టార్ హీరో లేరంటే అతిశయోక్తి కాదు ఈ తరం సంగీత దర్శకులలో మణిశర్మ తరువాత అంతగా పాప్యులర్ అయిన సంగీత దర్శకుడు దేవిశ్రీ, మరి అలాంటి దేవిశ్రీ సినిమాకు ఎంత తీసుకుంటాడు అనే సందిగ్ధం కచ్చితంగా ఉంటుంది. 
 

do you know the star music director devisree remuneration here is details
Author
Hyderabad, First Published Aug 2, 2021, 3:07 PM IST

పాటలు హిట్ అయితే సగం సినిమా హిట్ అయినట్లే అనేది టాలీవుడ్ నానుడి. బ్లాక్ బస్టర్ చిత్రాల విజయంలో మ్యూజిక్ పాత్ర ఏంటో ఉంటుంది దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమను ఏలుతున్నాడు దేవి శ్రీ ప్రసాద్. 1999లో విడుదలైన దేవి సంగీత దర్శకుడిగా మొదటి చిత్రం దేవి చిత్రాన్ని ఇంటి పేరుగా మార్చుకున్న శ్రీప్రసాద్ సౌత్ ఇండియా టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు. స్టార్ హీరోల మొదటి ఛాయిస్ గా మారిన దేవిశ్రీ అనేక హిట్ ఆల్బమ్స్ ఇచ్చారు. 

దేవిశ్రీ సంగీతం అందించని స్టార్ హీరో లేరంటే అతిశయోక్తి కాదు ఈ తరం సంగీత దర్శకులలో మణిశర్మ తరువాత అంతగా పాప్యులర్ అయిన సంగీత దర్శకుడు దేవిశ్రీ, మరి అలాంటి దేవిశ్రీ సినిమాకు ఎంత తీసుకుంటాడు అనే సందిగ్ధం కచ్చితంగా ఉంటుంది. 

కాగా దేవిశ్రీ రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ కావలసిందే. దాదాపు ఓ హీరో రేంజ్ రెమ్యూనరేషన్ ఆయన తీసుకుంటున్నారు. ప్రస్తుతం దేవిశ్రీ సినిమాకు మూడు నుండి నాలుగు కోట్ల రూపాయలు తీసుకుంటున్నారట. టాలీవుడ్ లో ఇది ఓ మీడియం రేంజ్ హీరో రెమ్యూనరేషన్.

 మరి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయనకు అంత డిమాండ్ ఉంది మరి . సౌత్ లో అనేక భాషలకు మ్యూజిక్ అందిస్తున్న దేవి శ్రీ ప్రసాద్ చేతిలో అనేక క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో పుష్ప ఒకటి. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న పుష్ప చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్ -బన్నీ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios