సూపర్ హీరో నేపథ్యంలో యుద్ధ వీరుల కథతో సినిమా సాగుతుందనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఇందులో పౌరాణిక, ఇతిహాసాల అంశాలుంటాయని అంటున్నారు. ఇంకోవైపు హాలీవుడ్ సూపర్ హీరోల కథని పోలి ఉంటుందని అంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న ఇంటర్నేషనల్ రేంజ్ ఉన్న మూవీ `ప్రాజెక్ట్ కే`. నాగ్ అశ్విన్ దీన్ని సైన్స్ ఫిక్షన్‌గా రూపొందిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ వంటి భారీ తారాగణం నటిస్తుంది. వీరితోపాటు మరికొన్ని సర్‌ప్రైజింగ్ క్యారెక్టర్లు ఉంటాయని తెలుస్తుంది. వైజయంతి మూవీస్ పతాకంపై సుమారు రూ.500కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు నిర్మాత అశ్వినీదత్.
సూపర్ హీరో నేపథ్యంలో యుద్ధ వీరుల కథతో సినిమా సాగుతుందనే ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఇందులో పౌరాణిక, ఇతిహాసాల అంశాలుంటాయని అంటున్నారు. ఇంకోవైపు హాలీవుడ్ సూపర్ హీరోల కథని పోలి ఉంటుందని అంటున్నారు. అయితే ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లలో ఓ వైపు పౌరాణికత, మరోవైపు లేటెస్ట్ ట్రెండ్ కనిపిస్తుంది. భూత, భవిష్యత్ కాలాల మేళవింపుగా, టైమ్ ట్రావెల్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. కానీ ఈ కథపై ఇప్పటి వరకు ఓ క్లారిటీ లేదు. అదే సమయంలో `ప్రాజెక్ట్ కే` అనేదానిపై కూడా క్లారిటీ లేదు. `ప్రాజెక్ట్ ఏంటీ, కే ఏంటీ అనే సందేహాలు కలుగుతున్నాయి.
తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. `ప్రాజెక్ట్ కే`లో కే మీనింగ్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఇందులో కే అంటే `కృష్ణుడు`, లేదంటే `కర్ణ` అని తెలుస్తుంది. అయితే దర్శకుడు ఈ సినిమాని ఒక్కదానితోనే క్లోజ్ చేయకుండా ఓ సిరీస్‌లా తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఏడెనిమిది సినిమాలుగా వరుసగా తెరకెక్కించాలనుకుంటున్నారట. అయితే ఒక్కో పాత్రకి ఒక్కో హీరోని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఒక్కో పార్ట్ ని ఒక్కో పాత్రతో, అందుకు తగ్గట్టుగా మరో హీరోతో ఈ సినిమాని తెరకెక్కించాలనుకుంటున్నారట. లాంగ్ రన్‌లో ఈ సినిమాని హాలీవుడ్ ఫ్రాంఛైజీల మాదిరిగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఇందులో ప్రభాస్ ఎలాంటి పాత్ర చేస్తున్నారనేది పెద్ద సస్పెన్స్. చిత్ర బృందం రివీల్ చేయడం లేదు. సినిమాకి సంబంధించి ప్రతిదీ గోప్యతని మెయింటేన్ చేస్తున్నారట. ఆయనకు జోడీగా దీపికా, దిశా పటానీ కథానాయికగా నటిస్తున్నారు. అమితాబ్ ది చాలాకీలక మైన పాత్ర అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి జనవరి 12న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.
