లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ భారీ చిత్రంలో స్టార్ హీరో సూర్య స్పెషల్ రోల్ లో నటించారు. అయితే ఈ సినిమాకు సూర్య చేసిన ఛార్జెస్ హాట్ టాపిక్ గా మారింది.
యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన తాజా చిత్రం ‘విక్రమ్’. ఈ చిత్రం రెండు రోజుల కింద (జూన్3న) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘కార్తీ’, ‘ఖైదీ’ చిత్రాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజు ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తో మరోసారి మ్యాజిక్ చూపించారు. ఆయన బ్రిలియెన్స్ కు ఆడియెన్స్ నుంచి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు స్టార్ హీరోస్ విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ను కీలక పాత్రల్లో కమల్ హాసన్ కు ధీటుగా చూపించడం పట్ల అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కూడా నటించడం సినిమాకు భారీ హైప్ ను తెచ్చిపెట్టింది. క్లైమాక్స్ లో సూర్య మాఫియా డాన్ గా ‘రోలెక్స్’ పాత్రను పోషించడం ఆడియెన్స్ తో విజిల్స్ వేయిస్తోంది. సినిమాలో సూర్య కనిపించిన రెండు, మూడు నిమిషాలైనా థియేటర్ మొత్తం దద్దరిల్లి పోతుండటం విశేషం. అయితే సూర్యకు కమల్ హాసన్ అంటే ఎంతో ఇష్టమనే విషయం తెలిసిందే. కొన్నేండ్లుగా కమల్ హాసన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలనే ఆయన డ్రీమ్ Vikramతో తీరిపోయిందని ఇటీవల ట్వీట్ ద్వారా తెలియజేశాడు.
కమల్ హాసన్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం కల్పించినందుకు కమల్ హాసన్ కు మరియు దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రంతో తన నటనకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో సూర్య పాత్రపై ఎంతటి టాక్ నడుస్తుందో... ఆ తీసుకున్న రెమ్యూనరేషన్ నూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తను అభిమానించే హీరో కమల్ హాసన్ తో ‘విక్రమ్’లో నటించేందుకు సూర్య ఒక్క పైసా కూడా తీసుకోలేదంట. పైగా ఆ డ్రీమ్ నెరవేర్చినందుకు యూనిట్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారంట. దీంతో ఆయన అభిమానులతో పాటు కమల్ హాసన్ అభిమానులు సూర్యను ఇంకా నచ్చేశావ్ అంటూ పొగుడుతున్నారు.
ఇక సూర్య విభిన్న పాత్రల్లో నటిస్తూ, రోటీన్ కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ వరుస హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇటీవల ‘ఆకాశమే హద్దురా, జై భీం’ వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం సూర్య41 (Suriya41) వర్క్ టైటిల్ తో బాలా దర్శకత్వంలో నటిస్తున్నాడు. అలాగే ‘రాకెట్రీ’ అనే బయోగ్రాఫికల్ ఫిల్మ్ లోనూ కామియో రోల్ లో కనిపించనున్నాడు.
