సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న తాజా చిత్రం డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11న రిలీజ్ కు రెడీ అవుతోంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న తాజా చిత్రం డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 11న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఓ ఈవెంట్ ద్వారా డీజే టిల్లు ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో చిత్రయూనిట్ మొత్తం పాల్గొంది.
అయితే సిద్ధు, నేహా శెట్టి ఇద్దరికీ రిపోర్టర్ నుంచి ఊహించని పరిస్థితి ఎదురైంది. ఈ చిత్ర ట్రైలర్ లో 'నీ ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి అని సిద్ధు.. నేహా శెట్టిని ఓ రొమాంటిక్ సీన్ లో అడుగుతాడు. దీనికి నేహా శెట్టి 16 అని సమాధానం ఇస్తుంది. దీనిపై రిపోర్టర్ మాట్లాడుతో సిద్దుకి అసభ్యకరమైన ప్రశ్న సంధించాడు.
ట్రైలర్ లో హీరోయిన్ పుట్టు మచ్చల గురించి మాట్లాడారు. రియల్ గా కూడా ఆమె పుట్టుమచ్చల గురించి తెలుసుకున్నారా అని ప్రశ్నించాడు. దీనితో కంగుతిన్న హీరో సిద్దు.. ఆ ప్రశ్నని అవాయిడ్ చేశాడు. దీనిపై నేహా శెట్టి సోషల్ మీడియాలో స్పందించింది.
'ఇలాంటి ప్రశ్న అడగడం చాలా దురదృష్టకరం. కానీ సిద్దు ఇచ్చిన సమాధానం అతడిపై గౌరవం మరింత పెంచింది. తన ఇంట్లో కానీ, వర్క్ ప్లేస్ లో కానీ మహిళలకు సిద్దు ఎంతో ప్రాధాన్యత, గౌరవం ఇస్తాడు అని నేహా శెట్టి తెలిపింది. ఇలా నేహా శెట్టి రిపోర్టర్ కి చురకలు అంటిస్తూ.. తన హీరోని ప్రశంసలతో ముంచెత్తింది.
డీజే టిల్లు చిత్రం యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ట్రైలర్ లో ఫన్ , రొమాన్స్ , నేహా శెట్టి అందాలు, సిద్దు కామెడీ పంచ్ లు బాగా కనిపిస్తున్నాయి. విమల్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి బ్యాగ్రౌండ్ సంగీతం తమన్ అందిస్తున్నాడు.
