Asianet News TeluguAsianet News Telugu

కాజల్‌ దీపావళి టపాసులు వస్తున్నాయి.. `సత్యభామ` టీజర్‌

కాజల్‌ అగర్వాల్‌ ప్రస్తుతం `సత్యభామ` అనే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీ నుంచి దీపావళి పండుగ స్పెషల్‌ రాబోతుంది. టాపాసుల్లాంటి అప్‌ డేట్‌ ఇచ్చింది యూనిట్‌.

diwali surprise ready from kajal starrer satyabhama movie teaser date arj
Author
First Published Nov 4, 2023, 11:37 PM IST | Last Updated Nov 4, 2023, 11:37 PM IST

అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌.. పెళ్లి తర్వాత లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల వైపు టర్న్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆమె `భగవంత్‌ కేసరి` చిత్రంలో నటించింది. ఇప్పుడు `సత్యభామ` అనే చిత్రంతో రాబోతుంది. లేడీ ఓరియెంటెడ్‌ మూవీగా రూపొందుతుంది. ఇందులో ప్రకాష్‌ రాజ్‌, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. శశి కిరణ్‌ తిక్క సమర్పణలో ఈ మూవీ రూపొందుతుంది. సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది.

 ఇందులో పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్ గా కనిపిస్తుంది కాజల్‌. అంతేకాదు కనిపించింది కాసేపే అయినా యాక్షన్‌తోనూ అదరగొట్టింది. ఆ తర్వాత శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పుడు అప్‌డేట్‌తో వచ్చింది టీమ్‌. దీపావళి పండుక్కి సర్‌ప్రైజ్‌ చేయబోతుంది. `సత్యభామ` చిత్రం నుంచి టీజర్‌ రాబోతుంది. తాజాగా యూనిట్‌ ఈ విషయాన్ని ప్రకటించింది. దివాళీకి పటాసుల్లాంటి ట్రీట్‌ ఇవ్వబోతున్నట్టు చెప్పింది. 

నిర్మాత మాట్లాడుతూ, ``సత్యభామ`లో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికి దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తిచేశాం. ఇటీవలే హైదరాబాద్ లో కాజల్ అగర్వాల్ పాల్గొన్న కీలక సన్నివేశాల తో పాటు యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించాం. ఈ నెల రెండో  వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభించబోతున్నాము. 

దీపావళి సందర్భంగా ఈ నెల 11న “సత్యభామ” టీజర్ రిలీజ్ చేస్తాం. వచ్చే సమ్మర్ కు సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాం. కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ “సత్యభామ”గా మిమ్మల్ని ఆకట్టుకుంటారు` అని అన్నారు. ఈ మూవీని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. `మేజర్` చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. ఈ మూవీకి శ్రీ చరణ్‌ పాకాల మ్యూజిక్‌, జీ విష్ణు కెమెరా వర్క్ చేస్తున్నారు. బాలాజీ కో ప్రొడ్యూసర్‌.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios