సోనూ నిగమ్‌ వ్యాఖ్యలపై భూషణ్‌ కుమార్ భార్య దివ్యా ఖోస్లా స్పందించింది. `గత కొంత కాలంగా సోనూ నిగమ్‌ టీ సిరీస్‌ అధినేత భూషణ్‌ కుమార్ మీద ఆరోపణలు చేస్తున్నాడు. పరిశ్రమతో సంబంధం లేని ఎంతో మందికి టీ సిరీస్ అవకాశాలు ఇచ్చింది, ఇక్కడ నెపోటిజంకు అవకాశమే లేదు` అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

ఇటీవల నెపోటిజం మీద సంచలన కామెంట్స్‌ చేసిన బాలీవుడ్ సింగర్‌ సోనూ నిగమ్‌పై ఎదురుదాడి మొదలైంది. ప్రముఖ మ్యూజిక్ కంపెనీ టీ సీరిస్‌పై సంచలన ఆరోపణలు చేసిన సోనూపై, టీ సిరీస్‌ అధినేత భూషణ్‌ కుమార్ భార్య దివ్యా ఖోస్లా సంచలన కామెంట్స్ చేసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తరువాత త్వరలోనే సంగీత పరిశ్రమలోనూ ఇలాంటి మరణాలు చూడబోతున్నాం, మ్యూజిక్‌ ఇండస్ట్రీలోనూ మాఫియా ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశాడు సోనూ. అంతేకాదు భూషణ్‌ కుమార్‌ తనకు అబూ సలేం నుంచి ప్రాణహాని ఉందని వేడుకుంటున్నాడంటూ చెప్పాడు.

ఈ వ్యాఖ్యలపై భూషణ్‌ కుమార్ భార్య దివ్యా ఖోస్లా స్పందించింది. `గత కొంత కాలంగా సోనూ నిగమ్‌ టీ సిరీస్‌ అధినేత భూషణ్‌ కుమార్ మీద ఆరోపణలు చేస్తున్నాడు. పరిశ్రమతో సంబంధం లేని ఎంతో మందికి టీ సిరీస్ అవకాశాలు ఇచ్చింది, ఇక్కడ నెపోటిజంకు అవకాశమే లేదు` అంటూ ఆమె చెప్పుకొచ్చింది. దర్శకురాలిగా తాను కూడా ఎంతో మందికి అవకాశాలు ఇచ్చానని చెప్పింది దివ్యా. నేహా కక్కర్, రకుల్ ప్రీత్ సింగ్‌ లాంటి వారిని తెరకు పరిచయం చేసింది నేనే అని చెప్పింది దివ్య.

అదే సమయంలో సోనూ స్టార్ గాయకుడిగా ఉన్నాడు ఆయన ఎంత మంది కొత్త వారికి అవకాశాలు వచ్చేందుకు సాయం చేశాడో చెప్పాలని కోరింది దివ్యా. ఒక్క వ్యక్తికి కూడా అవకాశం ఇవ్వని నువ్వు ఆరోపణలు చేయటం దారుణం అని చెప్పింది. వారసుల కోసం కాదు, మేం ప్రతిభ ఉన్నవారికోసమే చూస్తామని చెప్పింది దివ్యా ఖోస్లా.