డైరెక్టర్, బిగ్ బాస్ తెలుగు ఫేమ్ సూర్య కిరణ్ - సినీయర్ నటి కల్యాణి రెండేండ్ల కింద విడిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో చెబుతూ సూర్య షాకింగ్ కామెంట్స్ చేశారు.
చెన్నైకి చెందిన సూర్య కిరణ్ (Surya Kiran) డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. సుమంత్ తో ‘సత్యం’, మంచు మనోజ్ తో ‘రాజు బాయ్’ చిత్రాలు నిర్మించిన ఈయన ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈయన పాపులర్ రియాలిటీ గేమ్ షో, అక్కినేని నాగార్జున్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ (Bigg Boss Telugu)తో మళ్లీ బుల్లితెరపై మెరిసాడు. తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూర్య కిరణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రెండేండ్ల కింద తన మాజీ భార్య, సీనియర్ నటి కల్యాణికి ఎందుకు విడాకులివ్వాల్సి వచ్చిందో రివీల్ చేశాడు.
సీనియర్ హీరోయిన్, ప్రముఖ నటి కల్యాణి (Kalyani) ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. కేరళకు చెందిన కల్యాణి.. మలయాళంతో పాటు, తెలుగు, తమిళ భాష చిత్రాల్లోనూ నటించిన అభిమానులను సంపాదించుకుంది. విభిన్న పాత్రలు పోషించిన ఈమె బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డులనూ సొంతం చేసుకుంది. 2020లో తన మాజీ భర్త సూర్య కిరణ్ నుంచి కల్యాణి డివోర్స్ తీసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి ‘ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు’ చిత్రంతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లి పీటల వరకు వచ్చింది. ఏట్టకేళలకు 2005లోనే గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. 15 ఏండ్లు కలిసి కాపురం చేసినా వీరికి పిల్లలు కలగలేదు.
కొన్ని వ్యక్తిగత కారణాలతో 2020లో విడాకులు తీసుకున్నారు. వీరు సెపరేట్ అవుతున్నారని ప్రకటించడంతో అప్పట్లో ఇండస్ట్రీకి చెందిన వారందరూ షాక్ అయ్యారు. అయితే సరైన నిర్ణయం మాత్రం ఇప్పటికీ తెలియలేదు. తాజాగా సూర్య ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డివోర్స్ పై స్పందించాడు... వారి 15 ఏండ్ల దాంపత్య జీవితంలో ఎన్నడూ అభిప్రాయ భేదాలు, గొడవలు రాలేదని చెప్పారు. కల్యాణి నాజీవితంలో చూసిన మంచి అమ్మాయిల్లో ఒకరు. అయినా కల్యాణి తన నుంచి విడాకులు అడగటానికి కారణం ఏంటో చెప్పలేదు. కానీ మే స్టార్ చేసిన సొంత ప్రొడక్షన్ వల్ల అప్పుల పాలయ్యాం. అప్పులు ఎలా తీర్చుతామోననో ఆందోళనతోనే కల్యాణి విడాకులు కోరిందని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. కానీ కల్యాణి మాత్రం ఎక్కడా తమ డివోర్స్ సంబంధించిన రీజన్ ను చెప్పలేదు.
