బిగ్ బాస్ హౌస్ నుండి మరో కంటెస్టెంట్ ఎలిమినేటై బయటికి రావడం జరిగింది. సమంత హోస్ట్ గా ఆదివారం కొనసాగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఉత్కంఠ మధ్య దివి ఎలిమినేటైనట్లు ప్రకటించారు. దీనితో బిగ్ బాస్ ని వీడిన ఎనిమిదవ కంటెస్టెంట్ గా దివి హౌస్ నుండి బయటికి జరిగింది. సరదాగా సాగిన పండగ ఎపిసోడ్ లో దివి ఎలిమినేషన్ ఇంటి సభ్యులను ఎమోషన్ కి గురి చేసింది. ముఖ్యంగా దివి ఎలిమినేషన్ ని అమ్మ రాజశేఖర్ తట్టుకోలేకపోయారు. ఆయన కన్నీరు పెట్టుకోవడం జరిగింది. 

ఎలిమినేటైన దివి గత సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ నిర్వహిస్తున్న బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఇక ఇంటి సభ్యుల గురించి కూడా ఆమె కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అఖిల్ కి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయని, సోహైల్ కోపం వస్తే క్రూరంగా మారిపోతాడని ఆమె చెప్పారు. 

దివికి భారీ ఫాలోయింగ్ ఏర్పడిందని...ఆమె కోసం చొక్కాలు చింపుకొనేలా యూత్ ఉన్నారని రాహుల్ చెప్పడంతో ఆమె ఎంజాయ్ చేశారు. ఐతే అమ్మ రాజశేఖర్ ని అడ్డు పెట్టుకొని దివి ఎప్పుడూ సేఫ్ గేమ్ ఆడేదనేది ఆమె మీద ఉన్న కంప్లైంట్. సమంత సైతం గేమ్ పై దివి ఇప్పుడిప్పుడే ఫోకస్ పెడుతున్నారని అన్నారు. ఇక రాహుల్ తో జరిగిన ఇంటర్వ్యూలో దివి తాను హౌస్ లో కొన్ని బ్లండర్స్ చేశానని ఒప్పుకోవడం జరిగింది. 

కాగా దివి ఎలిమినేషన్ పై కూడా ప్రేక్షకులలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ వారం ఖచ్చితంగా మోనాల్ ఎలిమినేటై వెళ్లిపోతుందని భావించిన ఆడియన్స్...దివి ఎలిమినేషన్ కావడంతో షాక్ అయ్యారు. అలాగే ఎలిమినేషన్ ఓటింగ్ ప్రకారం జరగడం లేదని అసహనం వ్యక్తం చేశారు.