ఆ కుర్రాడి పేరు అల్లడిన్.. ఆమె పేరు జాస్మిన్.. వీళ్లకు దొరికే భూతం పేరు జీని.. వీళ్ల దగ్గర ఓ ఎగిరే తివాచి, ఒక కోతి, ఇంకా ఒక పక్షి ఇలా బోలెడు ఉంటాయి.. జీని చేసే మాయలు.. ఎగిరే ఆ తివాచి ఎక్కడికి పడితే అక్కడ్డికి తీసుకుని వెళ్ళడం.. వంటివి మర్చిపోగలమా.. ఇంతకీ ఇవన్నీ ఎక్కడి పాత్రలో గుర్తుచ్చిందా..? యస్  'అలాద్దిన్' లోవి. మన చిన్నప్పటి నుంచీ అల్లావుద్దీన్.. అద్బుత దీపం కథ వింటూనే ఉన్నాం.. ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనే అనిపిస్తుంది. అందుకే ఈ కథ బేస్ చేసుకుని బోలెడు సినిమాలు ,సీరియల్స్ వచ్చాయి..సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి డిస్నీవాళ్లు సినిమా గా ముస్తాబు చేసి మన ముందు ఉంచుతున్నారు.

ప్రముఖ దర్సకుడు గై రిచీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మ్యూజికల్ ఫ్యాంటసీలో మెనా మస్సూద్ అలాద్దిన్ పాత్రలో నటించగా హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ జినీగా నటించి అదరకొట్టారు.  ఇక జాస్మిన్ యువరాణి పాత్రలో నవోమి స్కాట్ నటించగా..  మాంత్రికుడు జఫార్ పాత్రలో మార్వాన్ కెంజారి మనకు కనపడతారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసారు. 

ఈ ట్రైలర్ లో జీనిగా .. విల్ స్మిత్  అదరగొట్టాడు. బ్లూ కలర్ లో ..కండలు తిరిగిన శరీరం...చిన్న.. పిల్లి గడ్డంతో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ వెంటనే ఆకట్టుకునేలా ఉన్నాడు.  రెగ్యులర్ సినిమాలాగా కాకుండా మ్యూజికల్ ఫ్యాంటసీ జోనర్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించటం కలిసొచ్చే అశం. ఈ వేసవిలో అంటే..  మే లో రిలీజ్ కానుంది.