నటి డిస్కోశాంతి అన్ని ఇండస్ట్రీలలో కలిపి కొన్ని వందల చిత్రాలలో నటించింది. ఏ విషయాన్నైనా బోల్డ్ గా మాట్లాడడం ఆమెకు అలవాటు. తన కొడుకు మేఘాంష్ హీరోగా మారిం అంశంపై కూడా ఆమె సూటిగా స్పందించింది.

మేఘాంష్ హీరోగా మారడం తనకు ఇష్టంలేదని, ఈ విషయంలో శ్రీహరి కోరిక మాత్రం నెరవేరిందని చెబుతోంది డిస్కో శాంతి. తన కొడుకులు ఎప్పటికైనా సినిమాల్లోకి వెళ్తారని శ్రీహరి అంటుండేవారని, ఇప్పుడదే జరిగిందని చెప్పింది. అయితే తనకు మాత్రం కొడుకులను ఇండస్ట్రీకి పంపించడం ఇష్టం లేదని.. ఒక కొడుకు డాక్టర్ మరో కొడుకులాయర్ కావాలనేది తన కోరిక అని చెప్పింది.

అయితే శ్రీహరి మాత్రం ఈ విషయంలో తనను వారించేవారని గుర్తు చేసుకుంది. శ్రీహరి కోరిక ప్రకారమే ఇప్పుడు తన కొడుకు హీరోగా మారాడని, ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని చెప్పింది. అలానే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడింది. అమ్మాయిలు ఛాన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే అబ్బాయిలు రెచ్చిపోతుంటారని, అమ్మాయిలు మానసికంగా.. శారీరకంగా స్ట్రాంగ్ గా ఉంటే అప్పుడు ఎలాంటి కాస్టింగ్ కౌచ్ లాంటివి ఉండవని చెప్పింది.

ఇద్దరి అంగీకారంతో జరిగితే అది వేరే విషయం.. కానీ బలవంతం చేయడం మాత్రం ఇండస్ట్రీలో లేదని ఒకవేళ అలాంటివి జరిగితే ప్రతీ మహిళ చెప్పు తీసుకొని కొట్టాలని చెప్పింది.