యంగ్ హీరో సందీప్ కిషన్ పరాజయాలతోనే కెరీర్ ని నెట్టుకొస్తున్నాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రం తర్వాత సందీప్ కిషన్ కు ఇంత వరకు మరో సక్సెస్ అందలేదు. తెలుగు తమిళ భషాల్లో వరుసగా సినిమాలు చేస్తున్నా నిరాశాజనమైన ఫలితాలే ఎదురవుతున్నాయి. సందీప్ కిషన్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'నిను వీడని నీడని నేను'. హర్రర్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

సందీప్ కిషనే ఈ చిత్రానికి నిర్మాత. వెంకటాద్రి టాకీస్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తీక్ రాజు ఈ చిత్రానికి దర్శకుడు. సందీప్ కిషన్ సరసన అన్య సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తిక్రమైన వార్తని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రంలో దర్శకులు విఐ ఆనంద్, కార్తీక్ నరేన్ గెస్ట్ రోల్స్ లో నటించబోతున్నారు. హీరోయిన్ మాళవిక నాయర్ కూడా చిన్న పాత్రలో మెరవబోతోంది. 

వీరంతా సందీప్ కిషన్ కు మంచి స్నేహితులు. అందుకే సందీప్ అడగగానే ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. సందీప్ కిషన్, విఐ ఆనంద్ కాంబినేషన్ లో టైగర్ చిత్రం వచ్చింది. విఐ ఆనంద్ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' చిత్రంతో పాపులర్ అయ్యారు. 

ప్రస్తుతం నిను వీడని నీడను నేను చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని జులై 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.