Asianet News TeluguAsianet News Telugu

రామ్ కి మార్కెట్ లేదు, పదికోట్లు పోయాయి... దేవదాస్ దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి షాకింగ్ కామెంట్స్ 

రామ్ పోతినేని ని దేవదాసు చిత్రంతో హీరోగా పరిచయం చేశాడు వైవీఎస్ చౌదరి. చాలా గ్యాప్ తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చాడు. రామ్ కి రూపాయి మార్కెట్ లేదు. రిలీజ్ రోజు పది కోట్లు ఖర్చు చేశాను. ఆస్తులు తాకట్టులో పెట్టనంటూ కీలక కామెంట్స్ చేశాడు. 
 

director yvs chowdary interesting comments on ram pothineni debut movie devadasu ksr
Author
First Published Jun 10, 2024, 8:11 PM IST

1998లో విడుదలైన సీతారాముల కళ్యాణం చూతము రారండి చిత్రంతో దర్శకుడిగా మారిన వైవీఎస్ చౌదరి... సీతారామరాజు, లాహిరి లహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించాడు. అనంతరం ఆయన చేసిన చిత్రాలన్నీ పరాజయం పొందాయి. దాంతో ఆయన గ్యాప్ తీసుకున్నారు. అనూహ్యంగా నందమూరి వారసుడిని పరిచయం చేసే బాధ్యత ఆయన తీసుకున్నారు. హరికృష్ణ మనవడు నందమూరి తారకరామారావు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. 

హరికృష్ణ పెద్ద కుమారుడైన జానకిరామ్ కుమారుడే ఈ ఎన్టీఆర్. నేడు పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. ఈ క్రమంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన దేవదాస్ మూవీ సక్సెస్ ని ఉదహరించారు. 

రామ్ కి ఒక్క రూపాయి సేలబులిటీ లేదు. నేను రిలీజ్ రోజు 10 కోట్లు ఖర్చు చేశాను. ఆస్తులు అన్నీ స్టేక్ లో పెట్టాను. జనవరి 11న దేవదాసు రిలీజ్ అయితే వరుసగా స్టైల్, చుక్కల్లో చంద్రుడు, లక్ష్మీ చిత్రాలు విడుదలయ్యాయి. దేవదాసు థియేటర్స్ లో జనం లేరు. దేవదాసు శాటిలైట్ రైట్స్ తక్కువ ధరకు అమ్మి నేను నాలుగు వారాలు థియేటర్స్ కి వెళుతూ హాల్స్ ఆడియన్స్  తో నిండిపోయాయని కలరింగ్ ఇచ్చాను. 

సినిమా మెల్లగా పుంజుకుంది. 17 సెంటర్స్ లో 175 డేస్ ఆడింది.. అని అన్నారు. రామ్ కి అది డెబ్యూ మూవీ కాగా దేవదాసు విషయంలో తాను చేసిన రిస్క్ గుర్తు చేసుకున్నాడు. ఈ సినిమాతో ఇలియానాను సైతం హీరోయిన్ గా వైవిఎస్ చౌదరి పరిచయం చేయడం విశేషం. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios