యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ సెన్సిబుల్ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి చిత్రాలతో దర్శకుడిగా సత్తా చాటారు. నేచురల్ స్టార్ నానితో వివేక్ ఆత్రేయ చివరగా తెరకెక్కించిన చిత్రం 'అంటే సుందరానికీ'.
యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ సెన్సిబుల్ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి చిత్రాలతో దర్శకుడిగా సత్తా చాటారు. నేచురల్ స్టార్ నానితో వివేక్ ఆత్రేయ చివరగా తెరకెక్కించిన చిత్రం 'అంటే సుందరానికీ'. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కినప్పటికీ కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.
తాజాగా వివేక్ ఆత్రేయ ఓ ఇంటర్వ్యూలో సోషల్ మీడియా వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో వివరించారు. తనకు ఎదురైనా చేదు అనుభవం గురించి చెప్పారు. కోవిడ్ టైంలో నానా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి బాగా సీరియస్ అయింది. బ్లడ్ అవసరం కావడంతో మెసేజ్ సోషల్ మీడియాలో షేర్ చేసి నా నంబర్ ఇచ్చాను.
ఈ విషయం హీరోయిన్ అనుష్కకి కూడా తెలిసింది. దీనితో ఆమె తనవంతు సాయం చేస్తూ తన సోషల్ మీడియాలో మెసేజ్ ని షేర్ చేశారు. అప్పటి నుంచి నా పరిస్థితి ఏంటో మాటల్లో చెప్పలేను. అది అనుష్క నంబర్ అనుకుని చాలా మంది అసభ్యంగా మెసేజ్ లు పెట్టారు.

కొందరైతే వీడియో కాల్స్ చేశారు. మరికొందరు బట్టలు లేకుండా అసభ్యమైన ఫోటోలు పంపారు. విపరీతంగా ఫోన్ కాల్స్ వచ్చేవి. హీరోయిన్ల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా అనిపించింది. ఆ దారుణాలు మాటల్లో చెప్పలేం. వెంటనే ఆ నంబర్ ని బ్లాక్ చేసినట్లు వివేక్ ఆత్రేయ వివరించారు.
ఇక అంటే సుందరానికీ రిజల్ట్ పై వివేక్ ఓపెన్ అయ్యారు. ఆ చిత్ర ఫలితం నన్ను తీవ్రంగా బాధించింది. నిడివి 10 నిమిషాలు ఎక్కువైంది అని తెలుసు.. కానీ ఎడిట్ చేసేందుకు వీలు కాలేదు అని వివేక్ తెలిపారు.
