Asianet News TeluguAsianet News Telugu

‘మజ్ను’ డైరెక్టర్ కొత్త సినిమా టైటిల్ ‘జితేందర్ రెడ్డి’.. ఇంట్రెస్టింగ్ గా పోస్టర్.. డిటేయిల్స్

బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్ ను తెరకెక్కించిన ఆకట్టుకుంటున్న దర్శకుడు విరించి వర్మ (Virinchi Varma)  చాలా కాలం తర్వాత తన నెక్ట్స్ సినిమాను ప్రకటించారు. తాజాగా టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. 
 

Director Virinchi Varma Next movie Titled as Jithender Reddy NSK
Author
First Published Sep 9, 2023, 9:02 PM IST

దర్శకుడు విరించి వర్మ (Virinchi Varma)  ఇప్పటి వరకు చేసింది రెండు సినిమాలే అయినా.. గుర్తుండిపోయేలా చేశారు. యంగ్ హీరో రాజ్ తరుణ్ తో ‘ఉయ్యాల జంపాల’ తెరకెక్కించి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత మూడేళ్లకు నానితో ‘మజ్ను’ సినిమాను తెరకెక్కించారు. ఈ రెండు సినిమాల్లో బ్యూటీఫుల్ లవ్ స్టోరీని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. తన దర్శకత్వంతోనూ ఆకట్టుకున్నారు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత ఆయన నుంచి ఇంత వరకు ఎలాంటి మూవీ రాలేదు. 

ఆ మధ్యలో నందమూరి కళ్యాణ్ రామ్ తో ఓ సినిమాను ఉంటుందన్నారు. కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అలాగే రాజ్ తరుణ్ - విరించి కాంబోలోనూ ఓ సినిమా రానుందని అన్నారు. అదీ ముందుపడలేదు. ఇక ఏట్టకేళలకు ఏడేళ్ల తర్వాత విరించి వర్మ మూడో సినిమాపై అప్డేట్ అందింది. ఇప్పటికీ బ్యూటీఫుల్ లవ్ స్టోరీలను తెరకెక్కించిన ఆయన తదుపరి చిత్రం యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు. 

దర్శకుడు విరించి వర్మ తన తదుపరి చిత్రాన్ని ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్ పై చేస్తున్నారు. ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మాతగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. తాజాగా చిత్రానికి ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy)  అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను తాజాగా దర్శకుడు దేవకట్టా విడుదల చేశారు. రెండు పోస్టర్లు చాలా ఆసక్తికరంగా ఉంది. కొందరు ఊరి జనంతో మాట్లాడుతున్నట్టుగా ఒక పోస్టర్ ను, రెండ్ పోస్టర్ లో ఓ ఆఫీసు లోకి సింగిల్ గా జితేందర్ రెడ్డి ఎంట్రీ ఇస్తున్నట్టు చూపించారు. 

1980 లో జరిగిన ఒక పిరియడిక్ కథగా రూపొందుతుందని తెలిపారు. ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో రియల్ ఇన్సిడెన్స్ ను బేస్ చేసుకొని నడిచే సీరియస్ యాక్షన్ డ్రామా కథగా ఈ చిత్రం ఉండబోతుంది. జగిత్యాల జిల్లాకు చెందిన ఆర్ఎస్ఎస్ నాయకుడు జితేందర్ రెడ్డి జీవితం ఆధారంగా చిత్రం వస్తుందని తెలుస్తోంది. ఆయన చిన్నవయస్సులోనే చనిపోయారు. 

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి.ఎస్.జ్ఞానశేఖర్ ఈ సినిమాకు కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు. అలాగే గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. నాగేంద్ర కుమార్ ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా హీరో ఎవరనేది త్వరలో ప్రకటించబోతున్నారు. అలాగే ఈ మూవీకి  సంబంధించిన ఆర్టిస్టుల వివరాలు, ఫస్ట్ లుక్ త్వరలోనే వెల్లడించనున్నారు. 

Director Virinchi Varma Next movie Titled as Jithender Reddy NSK

Follow Us:
Download App:
  • android
  • ios