ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు విజయ బాపినీడు(86) మంగళవారం నాడు మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న బాపినీడు హైదరాబాద్ లో ఆయన స్వగృహంలో కన్నుమూశారు. 

సెప్టెంబర్ 22, 1936లో జన్మించిన ఆయన 1981లో 'డబ్బు డబ్బు డబ్బు' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు.  దర్శకుడిగానే కాకుండా 'యవ్వనం కాటేసింది' అనే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. 

అలానే విజయ, చిరంజీవి అలానే మరికొన్ని పత్రికలను నిర్వహించారు. అలనాటి స్టార్ హీరోలు చిరంజీవి, శోభన్ బాబు వంటి ప్రముఖ హీరోలతో సినిమాలు చేశారు.

చిరుతో ఆయన తెరకెక్కించిన 'గ్యాంగ్ లీడర్' సినిమా ఘన విజయం సాధించింది. 'ఖైదీ నెం 786', 'బిగ్ బాస్', 'మగధీరుడు', 'పట్నం వచ్చిన పతివ్రతలు', సీతాపతి ఛలో తిరుపతి', వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను టాలీవుడ్ కి అందించారు.