దర్శకుడు వెట్రిమారన్ లేటెస్ట్ మూవీ విడుతలై. ఈ చిత్ర తెలుగు వర్షన్ ప్రమోషన్స్ లో పాల్గొన్న దర్శకుడు వెట్రి మారన్ హీరో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై ఓపెన్ అయ్యారు.
కోలీవుడ్ లో వెట్రిమారన్ ఒక సెన్సేషన్. సామాజిక కోణాల్ని లోతుగా చెప్పే వెట్రిమారన్ డార్క్ ఫిల్మ్స్ అద్భుతాలు చేశాయి. ఐదు నేషనల్ అవార్డ్స్ అందుకున్న దర్శకుడు వెట్రిమారన్. స్టార్ హీరోలు సైతం ఆయనతో చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత రెండేళ్లుగా ఎన్టీఆర్-వెట్రిమారన్ కాంబోలో మూవీ అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే ఎన్టీఆర్ కానీ వెట్రిమారన్ కానీ స్పష్టత ఇచ్చింది లేదు. ఈ వార్తల్లో నిజం ఉందని తాజాగా రుజువైంది.
వెట్రిమారన్ లేటెస్ట్ మూవీ విడుతలై. కోలీవుడ్ లో మరో సెన్సేషనల్ మూవీగా అవతరించింది. ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న వెట్రిమారన్ మాటల్లో మాటగా ఎన్టీఆర్ ప్రాజెక్ట్ గురించి ఓపెన్ అయ్యారు. అసురన్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ని కలిశాను. ఆయనకు స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. ఆయనతో మూవీ పట్టాలెక్కాల్సింది. టైం సెట్ కాలేదు. సినిమా సినిమాకు నేను గ్యాప్ తీసుకుంటాను. అలా ప్రాజెక్ట్ డిలే అయ్యిందని వెట్రిమారన్ వెల్లడించారు.
కాబట్టి ఎన్టీఆర్ దర్శకుడు వెట్రిమారన్ తో మూవీ చేయాలనుకున్న మాట నిజమే. ఓకే అనుకున్న ఈ మూవీ పట్టాలెక్కలేదని క్లారిటీ వచ్చింది. ఇక వడ చెన్నై స్క్రిప్ట్ అల్లు అర్జున్ కి చెప్పానని, అదే సమయంలో మహేష్ బాబుని కూడా కలిశానని వెట్రిమారన్ చెప్పుకొచ్చారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వడ చెన్నై మూవీలో అల్లు అర్జున్ నటించేవారని పరోక్షంగా వెల్లడించారు.

ఇక విడుతలై చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. ఫస్ట్ పార్ట్ విడుదలై విజయం సాధించింది. స్టార్ కమెడియన్ సూరి ఈ చిత్ర హీరో కావడం విశేషం. తన ఇమేజ్ కి భిన్నంగా ఓ సీరియస్ రోల్ చేశారు ఆయన. విజయ్ సేతుపతి కీలక పాత్ర చేశారు.
