రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం చిత్రం ఏడాది క్రితం విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 'నీది నాదీ ఒకటే కథ' లాంటి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న చిత్రం తెరకెక్కించిన వేణు ఊడుగుల విరాటపర్వం చిత్రాన్ని రూపొందించారు.

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం చిత్రం ఏడాది క్రితం విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 'నీది నాదీ ఒకటే కథ' లాంటి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న చిత్రం తెరకెక్కించిన వేణు ఊడుగుల విరాటపర్వం చిత్రాన్ని రూపొందించారు. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫరవాలేదనిపించింది.

ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా సినిమా తీశారు. ఈ చిత్రంలో ప్రియమణి,నందిత దాస్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విడుదలై సరిగ్గా నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు వేణు ఊడుగుల సోషల్ మీడియాలో బోల్డ్ గా, ఎమోషనల్ గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

విరాటపర్వం.. ఏడాది పాటు నాలో ఏర్పడిన పరివర్తన.. విరాటపర్వం విడుదలై ఈరోజుతో ఏడాది పూర్తయింది. విరాట పర్వానికి ముందు ఉన్న 'నేను' దాని విడుదల తర్వాత ఉన్న 'నేను' ఒకటి మాత్రం కాదు. విరాటపర్వం అందమైన అనుభూతుల్ని ఇచ్చింది. ఎందరో బుద్ధి జీవుల ప్రగతిశీల ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను ఇచ్చింది. అదే సమయంలో మార్కెట్ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించింది. కాలి కింద మందుపాతర పేలినట్టయింది. కొన్ని నెలలపాటు నిద్ర లేని రాత్రులనిచ్చింది. ఈ వైరుధ్యం నన్ను ఆలోచనలో పడేసింది. నాకు నా ప్రేక్షకులకు మధ్య అనుబంధాన్ని పునః సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని విప్పి చెప్పింది. 

ఈ ఏడాది పాటు నాలో సృజనాత్మక వ్యక్తిత్వాన్ని నేను మరింత అర్థం చేసుకోవడానికి విరాటపర్వం స్ఫూర్తినిచ్చింది. అందుకే విరాటపర్వం నాకు ఒక సెల్ఫ్ డిస్కవరీ లాంటిది. తీయబోయే చిత్రాలకు ఉపోద్ఘాతం లాంటిది. విరాటపర్వం అనే ప్రయాణం మొదలెట్టిన నాటి నుండి ఇప్పటివరకు ఇక ముందు ఈ అనుభవంలో భాగమైన నా ప్రేక్షకులకు , తూము సరళక్క కుటుంబ సభ్యులకు ,సినిమాలో నటించిన నటీనటులకు, నా డైరెక్షన్ టీమ్ కి, రైటింగ్ టీమ్ కి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలికి, ప్రియమణి, నందిత దాస్, నవీన్ చంద్ర, మీడియా కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 

Scroll to load tweet…

ముఖ్యంగా రానా దగ్గుబాటి, సాయి పల్లవి.. నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సురేష్ బాబు, శ్రీకాంత చుండి లకి నా ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ వేణు ఊడుగుల ఎమోషనల్ కామెంట్స్ తో పోస్ట్ పెట్టారు. దీనితో నెటిజన్లు వేణు ఊడుగులని అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. విరాటపర్వం చిత్రం మంచి చిత్రం అని.. ఇప్పుడు ప్రేక్షకులు ఆ చిత్రాన్ని అర్థం చేసుకోలేకపోయినప్పటికీ కాల క్రమేణ ఆ చిత్రానికి గుర్తింపు దక్కుతుంది అని అంటున్నారు.