Asianet News TeluguAsianet News Telugu

`మనసంతా నువ్వే` దర్శకుడికి అమెరికన్‌ డాక్టరేట్‌..

`మనసంతా నువ్వే`, `నేనున్నాను` వంటి హిట్‌ మూవీస్‌తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వీఎన్‌ ఆదిత్యకి అమెరికన్‌ డాక్టరేట్‌ వరించింది. 
 

director v n aditya got prestigious american doctorate arj
Author
First Published Feb 25, 2024, 11:02 AM IST | Last Updated Feb 25, 2024, 11:02 AM IST

`మనసంతా నువ్వే`, `నేనున్నాను` వంటి సూపర్‌ హిట్‌ మూవీస్‌తో మెప్పించాడు దర్శకుడు వీఎన్‌ ఆదిత్య. దర్శకుడిగా టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తెరవెనుక నుంచి చాలా సినిమాలను సెటిల్‌ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా వీఎన్‌ ఆదిత్యకి గౌరవ డాక్టరేట్‌ వరించింది. దాదాపు పాతికేళ్లుగా సినీ పరిశ్రమలో తన ప్రస్థానాన్ని సాగిస్తున్న వీఎన్ ఆదిత్యకు అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ దక్కింది. 

బెంగళూర్ లో జరిగిన అంతర్జాతీయ పీస్ కాన్ఫరెన్స్ లో అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ వివిధ రంగాలలోని ప్రముఖులకి గౌరవ డాక్టరేట్ లను ప్రదానం చేసింది. అందులో సినిమా రంగం నుండి దర్శకుడు వీఎన్ ఆదిత్య డాక్టరేట్ అందుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ ఐఈఎస్ సలహాదారు శివప్ప, సెక్రటరీ జనరల్ డాక్టర్ శ్రీనివాస్ ఏలూరి, జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ డైరెక్టర్ నీలమణి, నేషనల్ ఎస్పీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు దినేష్ గురూజీ అతిథులుగా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ, `ఈ డాక్టరేట్ గౌరవాన్ని మా అమ్మగారికి అంకితం ఇస్తున్నా. నేను సినీ రంగంలో కాకుండా విద్యారంగంలో ఉన్నతస్థాయిలో ఉండాలని అమ్మ కోరుకుంది. నేను ఇష్టపడిన సినిమా రంగంలో డాక్టరేట్ పొందడం నాకే కాదు అమ్మకు కూడా సంతోషాన్ని ఇచ్చే విషయం. నాకు గౌరవ డాక్టరేట్ అందించిన అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు` అన్నారు. 

రైటర్‌గా అనేక సినిమాలకు పనిచేసిన వీఎన్‌ ఆదిత్య.. 2001లో `మనసంతా నువ్వే` చిత్రంతో దర్శకుడిగా మారారు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత రీమేక్‌ మూవీ `శ్రీరామ్‌` చేశారు. ఇది ఫర్వాలేదనిపించింది. నాగార్జునతో `నేనున్నాను` చేశారు. అలాగే `బాస్‌` సినిమాకి కూడా ఆయనే దర్శకుడు. `మనసు మాట వినదు`, సిద్ధార్థ్‌ `ఆట`, `రెయిన్‌ బో`, `రాజ్‌`, `ముగ్గురు`, `ఫోర్స్‌ డ్ ఆర్ఫన్‌` వంటి సినిమాలు చేశారు. 

read more: నాని సినిమాల లైనప్‌ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే.. ప్రభాస్‌ని మించిపోతున్నాడుగా..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios