దర్శకుడు త్రివిక్రమ్ కి హీరో పవన్ కళ్యాణ్ బంగారు గనిలా దొరికాడు. అవకాశం దొరికిందే తడవుగా పవన్ పుణ్యమంటూ కోట్లు వెనకేసుకుంటున్నారు. త్రివిక్రమ్ లక్ చూసిన మిగతా డైరెక్టర్స్ ముక్కున వేలు వేసుకుంటున్నారు.
అల వైకుంఠపురంలో చిత్రంతో భారీ హిట్ కొట్టి సూపర్ ఫార్మ్ లోకి వచ్చాడు త్రివిక్రమ్(Trivikram). హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఆ మూవీ తెరకెక్కింది. సదరు నిర్మాణ సంస్థలో ఆయనకు భాగస్వామ్యం కూడా ఉంది. దీంతో రెమ్యూనరేషన్ తో పాటు లాభాలు భారీగా ఆర్జించాడు. అల వైకుంఠపురంలో విడుదలై రెండేళ్లు అవుతుంది. వెంటనే ఎన్టీఆర్ తో మూవీ సెట్ చేశాడు. కరోనా కారణంగా ఆ మూవీ డిలే అయ్యింది. ఈ గ్యాప్ లో సైడ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేసిన త్రివిక్రమ్ మిత్రుడు పవన్ ని మలయాళ చిత్ర రీమేక్ వైపు మలుపు తిప్పాడు.
త్రివిక్రమ్ ఎంతంటే పవన్ (Pawan Kalyan)అంత. పొలిటికల్ గా కూడా వెన్నంటి నడిపించే మిత్రుడంటే అమితాభిమానం. దీంతో ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ కూడా పక్కన పెట్టి త్రివిక్రమ్ కి వాటా ఉన్న నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో భీమ్లా నాయక్ చేశారు. మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ కి రీమేక్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ (Bheemla Nayak)కి త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. దీనికి ఆయన తీసుకున్న సమయం కేవలం కేవలం మూడు నెలలు. ఈ మూడు నెలల వ్యవధిలో రూ. 20 కోట్లకు పైగా సంపాదించాడు.
ఇది ఓ స్టార్ డైరెక్టర్ ఏడాది సంపాదనతో సమానం. టైం కి సినిమా కుదరకపోతే అంత డబ్బు ఆర్జించడానికి రెండు మూడేళ్లు కూడా పట్టొచ్చు. కానీ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించి భారీ పారితోషికం రాబట్టాడు. ఏదో సామెత చెప్పినట్లు పవన్ రీమేక్ సినిమాలతో కోట్లు ఆర్జించడానికి అలవాటు పడిన త్రివిక్రమ్ మరో రీమేక్ కి ఆయనను సిద్ధం చేశారు. వినోదయ చిత్తం రీమేక్ అధికారికమే అని తెలుస్తుండగా.. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు అందించడానికి మరో రూ. 20 కోట్లు డిమాండ్ చేశారట. ఓ రీమేక్ చిత్రానికి స్క్రీన్ ప్లే కోసం అంతగా శ్రమించాల్సిన అవసరం ఉండదు. త్రివిక్రమ్ తన తెలివితేటలు ఉపయోగించి తక్కువ సమయంలో గొప్పగా సంపాదిస్తున్నారు.
ఇదంతా కేవలం పవన్ వలెనే. పవన్ కళ్యాణ్ స్నేహం అడ్డుపెట్టుకుని కోట్లు సంపాదిస్తున్నాడు త్రివిక్రమ్. ఆయన ఒప్పుకున్న భారీ చిత్రాలు హరి హర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ కూడా పక్కన పెట్టి రీమేక్స్ వైపు మరలేలా చేస్తున్నారు. ఒకవైపు ఫ్యాన్స్ రీమేక్స్ వద్దు మొర్రో అంటున్నారు. యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్, అవమానాలు తట్టుకోలేకపోతున్నామని మొరపెడుతున్నా, త్రివిక్రమ్ తన స్వార్థం కోసం పవన్ ని వాడేస్తున్నాడు. జల్సా మూవీతో త్రివిక్రమ్, పవన్ కలవడం జరిగింది. త్రివిక్రమ్ కెరీర్ అప్పటి నుండే ఊపందుకోవడం గమనించాల్సిన విషయం. మాటల మాంత్రికుడిగా పేరున్న త్రివిక్రమ్ నిజ జీవితంలో కూడా పవన్ ని తన మాటల మాయలో పడేస్తున్నట్లు క్లియర్ గా అర్థం అవుతుంది.
