డైరెక్షన్ కి బ్రేక్ ఇచ్చి... నిర్మాతగా మారనున్న త్రివిక్రమ్!

దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం మూవీ నిరాశపరిచింది. త్రివిక్రమ్ మార్క్ ఎక్కడా కనిపించలేదనే విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలో లాంగ్ గ్యాప్ తీసుకుని స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నారట త్రివిక్రమ్.. 
 

director trivikram srinivas will take long break from direction ksr

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పరిశ్రమలో ఒక ఇమేజ్ ఉంది. ముఖ్యంగా ఆయన్ని మాటల మాంత్రికుడు అంటారు. బెస్ట్ డైలాగ్ రైటర్ అనడంలో సందేహం లేదు. కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలు అద్భుతంగా రాస్తారు. త్రివిక్రమ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అదే సమయంలో విమర్శలు కూడా ఉన్నాయి. పలుమార్లు కాపీ వివాదాల్లో త్రివిక్రమ్ చిక్కుకున్నారు. ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ ని అజ్ఞాతవాసి గా తెరకెక్కించి త్రివిక్రమ్ అడ్డంగా బుక్ అయ్యాడు. 

అజ్ఞాతవాసి ఫలితం కూడా నెగిటివ్ గా రావడంతో ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. 2016లో వచ్చిన అ ఆ.. మూవీ కథ విషయంలో కూడా కాపీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. యద్దనపూడి సులోచనారాణి రాసిన మీనా నవల ఆధారంగా ఆ చిత్రం తెరకెక్కింది. బ్లాక్ బస్టర్ అలా వైకుంఠపురంలో... ఎన్టీఆర్ ఇంటిగుట్టు చిత్రానికి మోడ్రన్ వెర్షన్. 

ఇక గుంటూరు కారం మూవీని కనీస సన్నద్ధం కాకుండా పూర్తి చేసి వదిలారు. కథ, కథనాలు లేకుండా కేవలం మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ నమ్ముకుని మూవీ తెరకెక్కించారు. గుంటూరు కారం లో ఎక్కడా త్రివిక్రమ్ మార్క్ కనిపించదు. త్రివిక్రమ్ కి పవన్ కళ్యాణ్ రీమేక్స్ పై ఉన్న శ్రద్ధ.. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రాలపై లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. భీమ్లా నాయక్, బ్రో చిత్రాలకు స్క్రీన్ ప్లే, మాటలు అందించి త్రివిక్రమ్ భారీగా ఆర్జించారు. 

కాగా త్రివిక్రమ్ నెక్స్ట్ అల్లు అర్జున్ తో చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ సందిగ్ధంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బన్నీ మాత్రమే పుష్ప 2 తర్వాత మరొక దర్శకుడితో మూవీ ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ, ఎన్నికలు అయ్యాక మూడు చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లకు పలు కమిట్మెంట్స్ ఉన్నాయి. దాంతో త్రివిక్రమ్ కి లాంగ్ వెయిటింగ్ తప్పదని అంటున్నారు. 

ఈ గ్యాప్ లో మంచి స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నారట. అదే సమయంలో తన సొంత నిర్మాణ సంస్థ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లో చిత్రాలు నిర్మించాలని అనుకుంటున్నారట. ఇతర దర్శకులతో తన బ్యానర్ లో సినిమాలు చేస్తారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. మరి చూడాలి, త్రివిక్రమ్ ఏం చేయనున్నారో.. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios