మన సెలబ్రిటీలు చాలా మంది తాము సంపాదించే మొత్తాన్ని వ్యాపారాలపై పెట్టుబడులు పెడుతుంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది థియేటర్ బిజినెస్ పై పడ్డారు. ఇటీవల మహేష్ బాబు 'ఏఎంబీ' థియేటర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే.

అల్లు అర్జున్ కూడా త్వరలోనే ఓ మల్టీప్లెక్స్ మొదలుపెట్టనున్నాడు. ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నాడని సమాచారం. టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ ఒక్కో సినిమాకి పదిహేను కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటారని సమాచారం.

మొదటినుండి త్రివిక్రమ్ పెట్టుబడులు పెడుతూనే ఉన్నాడు. హైదరాబాద్ శివార్లలో భూములు కొన్నారు. మంచి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా థియేటర్ కి యజమాని కూడా అయ్యాడు. ఇటీవల ఆరుకోట్ల పెట్టుబడి పెట్టి ఈస్ట్ గోదావరిలో రాజానగరంలో ఓ థియేటర్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్నారు. 

ఆ థియేటర్ ను ఈస్ట్ లోనే ఒకరికి నిర్వహణకు అప్పగించారు. రాయుడు అనే ఈ థియేటర్ ని గతేడాది రిన్నోవేట్ చేశారు. ఆ సమయంలోనే థియేటర్ ను మూడున్నర కోట్లకు అమ్మాలని చూశారు. కానీ అప్పట్లో అమ్ముడు కాలేదు. అదే థియేటర్ ను ఇప్పుడు త్రివిక్రమ్ 4.90 కోట్లకు కొన్నట్లు సమాచారం. అక్కడ ల్యాండ్ రేటే రెండున్నర కోట్ల వరకు  ఉందట.