మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుమను ఉద్దేశిస్తూ సరదా కామెంట్స్ చేశారు. సదరు కామెంట్స్ రాజీవ్ కనకాల గాలి తీసేసాయి.  

సుమ-త్రివిక్రమ్ మధ్య జరిగిన సరదా సంభాషణ నటుడు రాజీవ్ కనకాల గాలి తీసేసింది. మాటల్లో మాటగా రాజీవ్ ఇంట్లో వంట చేస్తాడని పబ్లిక్ లో చెప్పి త్రివిక్రమ్ ఆయనకు షాక్ ఇచ్చాడు. సార్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా త్రివిక్రమ్ హాజరయ్యారు. వేదికపై ఆయన మాట్లాడాల్సిన సమయం వచ్చింది. యాంకర్ సుమ మైక్ ఇచ్చారు. వేదికపై ఉన్న ప్రముఖుల సంగతి పక్కన పెట్టి కాసేపు సుమతో త్రివిక్రమ్ సోదేసుకున్నాడు. అసలు సంబంధమే లేని టాపిక్ తెరపైకి తెచ్చాడు. 

ప్రతి రోజూ నేనే వంట చేస్తాను. ఇవాళ ఈవెంట్ కి వచ్చాను కాబట్టి మా ఆవిడ చేస్తుంది. కాబట్టి మీ అందరి తరపున ఆమెకు శుభాకాంక్షలు. సుమ గారిని ఎప్పుడు చూసినా పొగడాలనిపిస్తుంది. ఆమె చాలా బిజీ. ఇంట్లో వంట కూడా రాజీవ్ కనకాలనే చేస్తారు. సుమ ఎప్పుడూ ఈవెంట్స్ తో బిజీగా ఉంటుంది. ఒకసారి మా ఆవిడ గ్యాస్ స్టవ్ మంట తగ్గించమంది. క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా అని అడిగాను. అప్పటి నుండి మా ఆవిడ నన్ను వంట గదిలోకి రానివ్వదు... అన్నారు. 

ప్రతిరోజూ నేనే వంట చేస్తానన్న త్రివిక్రమ్ మర్చిపోయి మా ఆవిడ అసలు వంట గదిలోకి కూడా రానివ్వదని చెప్పాడు. కాబట్టి త్రివిక్రమ్ ఇవ్వన్నీ సరదాకు చెబుతున్నాడనుకోవచ్చు . అయితే రాజీవ్ కనకాలనే ఘోరంగా బుక్ చేశాడు. సుమ బిజీ ఇంట్లో రాజీవ్ వంట చేస్తాడని చెప్పడం ఆయన మనోభావాలు దెబ్బతీయడమే అని నెటిజెన్స్ అభిప్రాయం. భార్య షోలతో బిజీగా ఉంటే పనిలేని రాజీవ్ ఇంటి పనులు చేస్తున్నాడన్నట్లు ఆయన కామెంట్స్ ఉన్నాయి. ఏదో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలనే తపనలో త్రివిక్రమ్ రాజీవ్ కనకాల గాలి తీశాడు. 

త్రివిక్రమ్ కామెంట్స్ కి సుమ ముఖం కూడా తెల్లబోయింది. దీని గురించి చర్చించాలని మీరు గొడవ రాజేస్తున్నారని చెప్పకనే చెప్పింది. త్రివిక్రమ్ కామెంట్స్ కి నొచ్చుకున్న రాజీవ్ ఖచ్చితంగా సుమ దగ్గర అసహనం బయటపెట్టి ఉంటారన్న మాట వినిపిస్తోంది.