గుంటూరు కారం మూవీ విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో సునీల్ కి ఎలాంటి ప్రాధాన్యత లేని రోల్ ఇచ్చాడు త్రివిక్రమ్. మిత్రుడికి అన్యాయం చేశాడనే టాక్ వినిపిస్తుంది.
త్రివిక్రమ్-సునీల్ ఒకేసారి పరిశ్రమకు వచ్చారు. కెరీర్ లో ఎదిగే క్రమంలో కష్టనష్టాలు చూశారు. ఒక రూమ్ లో ఉంటూ ఆఫర్స్ కోసం ప్రయత్నాలు చేశారు. అంతటి బాండింగ్ వాళ్ళ మధ్య ఉంది. త్రివిక్రమ్ రచయితగా ఉన్ననాటి నుండే సునీల్ కి మంచి రోల్స్ వచ్చేలా చేశారు. దర్శకుడు అయ్యాక తన ప్రతి సినిమాలో కామెడీ రోల్ సునీల్ కోసం రాశారు.
త్రివిక్రమ్ స్టార్ హీరో కాగా సునీల్ స్టార్ కమెడియన్ అయ్యాడు. అనంతరం హీరోగా కూడా సినిమాలు చేశాడు. హీరోగా సునీల్ కి మొదట్లో హిట్స్ పడ్డాయి. తర్వాత అనుకున్న స్థాయిలో ఆడలేదు. దాంతో పంథా మార్చాడు. విలన్, క్యారెక్టర్ రోల్స్ ఎక్కువగా చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో సునీల్ బిజీగా ఉన్నాడు.
అలాంటి సునీల్ కి గుంటూరు కారం చిత్రంలో కనీస ప్రాధాన్యత దక్కలేదు. గుంటూరు కారం మూవీలో సునీల్ కేవలం ఒక సన్నివేశంలో కనిపిస్తాడు. ఇలాంటి చిన్న పాత్రకు సునీల్ ఎందుకు తీసుకున్నారనే చర్చ నడుస్తుంది. గుంటూరు కారం విషయంలో మొత్తంగా త్రివిక్రమ్ ప్లానింగ్ సరిగా లేదని చెప్పాలి.
ఇక టాక్ ఎలా ఉన్నా గుంటూరు కారం ఫస్ట్ డే వసూళ్లు బాగున్నాయి. వరల్డ్ వైడ్ గుంటూరు కారం మొదటిరోజు రూ. 79.30 కోట్ల గ్రాస్, 52.03 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు రిపోర్ట్ చేశారు. ఇక గుంటూరు కారం చిత్రంలో మహేష్ కి జంటగా శ్రీలీల నటించింది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు కీలక రోల్స్ చేశారు. థమన్ సంగీతం అందించగా సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.
