Asianet News TeluguAsianet News Telugu

#SundeepKishan: రవితేజ డైరక్టర్ తో సందీప్ కిషన్ నెక్ట్స్?

కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రెడీ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ , హస్య మూవీస్ పతాకం పై రాజేష్ దండా కలిసి ...

Director Trinadha Rao Nakkina next with Sundeep Kishan jsp
Author
First Published Feb 20, 2024, 11:10 AM IST


సందీప్ కిషన్ లో టాలెంట్ ఉంది కానీ ఎందుకనో విజయం మొహం చాటేస్తోంది. సరైన హిట్ పడి చాలా కాలం అయ్యింది. వరస పెట్టి ప్రయోగాలు లాంటి సినిమాలు డిఫరెంట్ కాన్సెప్టు లతో చేస్తున్నా కలిసి రావటం లేదు. అదే సమయంలో ఆ డిఫరెంట్ కాన్సెప్టులే అతన్ని ఇన్ని ప్లాఫ్ లు వచ్చినా ఇంకా సినిమాలు తెచ్చి పెడుతున్నాయి. ఓపినింగ్స్ ఇస్తున్నాయి. రీసెంట్ గా సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన. ఈ చిత్రం ఫిబ్రవరి 16న  ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యింది. సూపర్ నేచురల్, ఫాంటసీ ఎలిమెంట్స్ తో పాటు హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఉన్న ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఓపినింగ్స్ రావటం, వీకెండ్ ఫరవాలేదు అనిపించటంతో అదే బ్యానర్ వాళ్లు సందీప్ కిషన్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అందుతున్న సమాచారం మేరకు ... రవితేజ కెరీర్ లో రీసెంట్ గా సూపర్ హిట్ గా నిలిచిన థమాకా దర్శకుడు నక్కిన త్రినాధరావు ఈ చిత్రానికి దర్శకుడు అని తెలుస్తోంది. ఓ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రెడీ చేస్తున్నట్లు చెప్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ , హస్య మూవీస్ పతాకం పై రాజేష్ దండా కలిసి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డిస్కషన్ స్టేజీలో ఉన్న ఈ చిత్రం బడ్జెట్ దగ్గరే ఆగిందని, అది ఫైనల్ అయితే త్వరలో ఎనౌన్సమెంట్ వస్తుందని అంటున్నారు.

ఇంతకాలం  కొత్త డైరెక్టర్లు, ప్లాపుల్లో ఉన్న దర్శకులు మాత్రమే సందీప్ కిషన్ తో సినిమా చేస్తూ వస్తున్నారు. ఈ ప్రాజెక్టు సెట్ అయితే కనుక సందీప్ కిషన్ కమర్షియల్ జానర్ లో సినిమా అవుతుందని, మళ్లీ సందీప్ కిషన్ ఫామ్ లోకి వస్తాడని వినిపిస్తోంది.  ఈ  సూపర్ కాంబో లో సినిమా సెట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ శాతం ఉందని వార్తలు వస్తున్నాయి. సందీప్ కిషన్ లో ఉన్న ఫన్  యాంగిల్ ని రైజ్ చేస్తే వెంకటాద్రి ఎక్సప్రెస్ రేంజిలో ఈ సినిమా వర్కవుట్ అవుతుందని ట్రేడ్ అంటోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios