కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లు ఎవరి డైరక్షన్ లో వచ్చిన సినిమా వాళ్లకు అద్బుతంగా కనపడుతుంది. ఓ క్లాస్ సినిమాగా క్లాసిక్ గా ఇంకా కల్ట్ సినిమాగా అనిపిస్తూంటుంది. ఇప్పుడు అదే పరిస్దితి హిప్పీ దర్శకుడుది. తమిళ దర్శకుడు టీఎన్ కృష్ణ డైరక్షన్ లో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా తెరకెక్కిన సినిమా ‘హిప్పీ’. రీసెంట్ గా  ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది.  కలెక్షన్స్ మరీ నాసి రకంగా ఉన్నాయి. అయితే ఈ విషయం డైరక్టర్ ఒప్పుకునేటట్లు లేరు.  ఆయన ట్విట్టర్ ద్వారా తన సినిమా భవిష్యత్ లో క్లాసిక్ అవుతుందని చెప్తున్నారు. 

అప్పట్లో నేను తీసిన ‘నువ్వు నేను ప్రేమ’ సినిమాకు కూడా ఇలానే విమర్శలు వచ్చాయి… ద హిందు అనే పత్రికలో అశోక్ కుమార్ అనే క్రిటిక్ అయితే చాలా విమర్శలు గుప్పిస్తూ కథనం రాశాడు.. కానీ ఇప్పుడు ఆసినిమా క్లాసిక్ అయింది.. అలానే ఇప్పుడు నేను తీసిన ‘హిప్పీ’ సినిమా విషయంలో కూడా జరుగుతుంది. హిస్టరీ మళ్లీ రిపీట్ అవ్వబోతుంది.. ‘హిప్పీ’ కూడా ఓ క్లాసిక్ అవుతుంది. ధియేటర్ల లో సినిమా చూసిన యూత్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని ట్వీట్ లో పేర్కొన్నారు.  అయితే ఈ ట్వీట్ చూసిన వాళ్లంతా డైరక్టర్ కామెడీ చేస్తున్నాడంటూ వెటకారం చేస్తున్నారు. 

ఇక ఈ సినిమాలో హీరో కార్తీకేయ సరసన దిగంగన హీరోయిన్‌గా నటించంగా.. JD చక్రవర్తి ఒక ముఖ్య పాత్రలో నటించారు.. కబాలి,కాలా వంటి చిత్రాలు నిర్మించిన నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. నివాస్ ప్రసన్న సంగీతం అందించాడు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫి ఆర్.డి రాజశేఖర్.