టాలెంటెడ్ డైరెక్టర్ తేజ నుంచి వస్తున్న తాజా చిత్రం సీత. అందాల చందమామ కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ పోషిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా, సోనూసూద్ విలన్ గా నటిస్తున్నాడు. చాలా కాలం తర్వాత దర్శకుడు తేజ నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు. దీనితో సీత చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కెరీర్ లో తొలిసారి కాజల్ అగర్వాల్ విభిన్నమైన పాత్రలో మోడ్రన్ సీతగా నటిస్తోంది. మే 24 న శుక్రవారం ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. 

సోమవారం రోజు గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో తేజ మాట్లాడుతూ సీత చిత్రం బాగా వచ్చిందని అన్నారు.  సూపరా లేక బాగుందా అనేది మీరే చూసి చెప్పాలి అని ఆడియన్స్ ని ఉద్దేశించి అన్నారు. ఎందుకంటే ఒక సినిమాని జడ్జ్ చేసేంత ప్రతిభ నాకు లేదు. కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాను కాబట్టి మేధావి అనుకోవద్దు. కళ్ళజోడు పెట్టుకుని ఉన్నవారందరూ మేధావులు కాదు. ఈ  పరుచూరి బ్రదర్స్ కి చూపించి ఏవైనా తప్పులు ఉంటే చెప్పమని అడిగా. వారు సూచించిన విధంగా రీ షూట్ చేశాం. 

విడుదలైన తర్వాత ఆడియన్స్ వద్ద ఏకించుకోవడం కంటే.. మీరే ముందుగానే ఏకేస్తే బెటర్ అని వాళ్ళతో చెప్పానని తేజ సరదాగా అన్నారు. ఆడియన్స్ ను ఉద్దేశించి మాట్లాడుతో మీరు నన్ను తిట్టినా, పొగిడినా నేను సినిమాలు చేస్తూనే ఉంటా. ఎందుకంటే నాకు సినిమాలు తప్ప ఇంకేమి తెలియదు అని తేజ అన్నారు. మీరు తేజకు బుర్రలేదు అని తిట్టినా ఆ డైలాగ్ నా సినిమాలో పెట్టేస్తా అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.