Asianet News TeluguAsianet News Telugu

షకీలా మ్యాటర్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందో

షకీలా తెరపై కనపడగానే కుర్రాళ్లందరూ హారతులు పడుతన్నారట. ఆ క్రేజ్‌ చూసి తేజ ఆశ్చర్యపోయాడట. అదే సమయంలో జయం సినిమాలో..

Director Teja Shared Incident About Shakeela
Author
First Published May 29, 2023, 12:10 PM IST


. తేజ్ తెరకెక్కించిన సినిమాల్లో జయం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తేజ టీచర్ పాత్రకు శృంగార తారగా పేరు తెచ్చుకున్న షకీలను ఎలా ఎంపిక చేశారో తెలిపారు. జయంకు ముందు ఐదారు సినిమాల్లో షకీలా నటించింది. కానీ అవేవి ఆమెకు పెద్దగా క్రేజ్‌ను తెచ్చిపెట్టలేకపోయాయి. అయితే 20ఏళ్ల క్రితం వచ్చిన జయం సినిమా మాత్రం షకీలాకు తెలుగులో పేరొచ్చింది. కాగా ఆమెను జయం సినిమాలో ఎంపిక చేయడానికి రీజన్‌ ఏంటో తేజ చెప్పాడు. 

జయం సినిమా మొదలవడానికి ముందు తేజ.. ఆర్‌పీ పట్నాయక్‌తో పాటు మరో వ్యక్తితో కలిసి హైదరాబాద్‌లో కార్లో వెళ్తుండగా కాచిగూడలోని తారకరామా థియేటర్‌లో జనాలు కుప్పలుకుప్పులుగా గుమికూడారట. థియేటర్‌ గేట్‌లు ఓపెన్‌ చేయగానే కుర్రాళ్లందరూ లోపలికి పరుగులు తీశారట. అంతగా జనాలను పిచ్చేకించే సినిమా ఏం అయి ఉంటుందని చూస్తే కామేశ్వరి అనే పోస్టర్‌ కనిపించందట.

షకీలా ఎవరు అని అక్కడున్న వారిని అడిగితే.. వాళ్లు ఆమె గురించి చెప్పారట. అయితే ఆమెకు ఎందుకు అంత క్రేజ్‌ ఉందా అనుకుని తను కూడా టిక్కెట్‌ తీసుకుని హాల్‌లోకి వెళ్లాడట. షకీలా తెరపై కనపడగానే కుర్రాళ్లందరూ హారతులు పడుతన్నారట. ఆ క్రేజ్‌ చూసి తేజ ఆశ్చర్యపోయాడట. అదే సమయంలో జయం సినిమాలో లెక్చరర్ పాత్రకు తనే అని ఫిక్సయిపోయినట్లు తెలిపాడు. అలా తను నటీనటులను ఎంపిక చేసే విధానం ఉంటుందని తేజ చెప్పుకొచ్చాడు. అయితే హఠాత్తుగా షకీలా ఎందుకు గుర్తొచ్చిందో డైరక్టర్ గారికి అంటున్నారు సినీ జనం. 

 సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్‌ ప్రారంభించిన తేజ చిత్రం సినిమాతో మెగాఫోన్‌ పట్టాడు. తొలి సినిమానే ఆయనకు తిరుగులేని విజయాన్నిచ్చింది. ఆ తర్వాత బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో కొంత కాలానికే పెద్ద దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios