సూపర్ స్టార్ మహేష్ బాబు, తేజ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'నిజం'. 2003లో విడుదలైన ఈ చిత్రంలో మహేష్ బాబు సరికొత్తగా కనిపించాడు. మంచి సందేశాత్మక అంశాలతో తేజ ఈ చిత్రాన్ని రూపొందించారు. కానీ నిజం చిత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలబడలేకపోయింది. మహేష్ బాబు నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. ఆ పాత జ్ఞాపకాలని తేజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. 

నిజం చాలా మంచి సినిమా. మహేష్ బాబు ఒక్కడు సినిమా ఎఫెక్ట్ నిజంపై పడడం వల్ల ప్లాప్ అయింది. నిజం కంటే ముందుగా ఒక్కడు విడుదలయింది. ఆ చిత్రంతో మహేష్ బాబు ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఒక్కడు చిత్రంలో మహేష్ ని చూసిన తర్వాత నిజం చిత్రంలో ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. 

నిజం ప్లాప్ కావడం వల్ల నాకు, మహేష్ కు గొడవలు జరిగాయని ఏవేవో వార్తలు వచ్చాయి. వాస్తవానికి మహేష్ కు, నాకు మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని తేజ వివరణ ఇచ్చారు. వరుస పరాజయాల్లో ఉన్న తేజ నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో విజయాల బాట పట్టారు. ఇటీవల తేజ తెరకెక్కించిన సీత చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా నటించిన ఈ చిత్రానికి ఆశించిన రెస్పాన్స్ రాలేదు.