'ఉప్పెన' సినిమాతో కృతి శెట్టి స్టార్ డమ్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోయిన్స్ లో ఇప్పుడు ఈమెకు కుర్రాళ్లలో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. అసలు 'ఉప్పెన' సినిమా సెట్స్ పై ఉండగానే నాని సినిమాలోనూ .. సుధీర్ బాబు మూవీలోను కృతి ఛాన్స్ కొట్టేసింది. రామ్- లింగుస్వామి ప్రాజెక్టులోను అడుగుపెట్టేసింది. ఇక నితిన్ ..  చైతూ .. నిఖిల్ ..  నాగశౌర్య వంటి హీరోలు లైన్లో ఉండనే ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఒక వార్త మీడియాలో మొదలైంది. దగ్గుబాటి అభిరామ్ హీరోగా తేజ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అభిరామ్ ఈ సినిమాతోనే హీరోగా తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కృతి శెట్టిని అడిగారట. అయితే డేట్స్ ఖాళీగా లేవని చెప్పి, తేజ ఆఫర్ ను ఈ అమ్మాయి సున్నితంగా తిరస్కరించిందని అంటున్నారు. 

ఇక తేజ తన సినిమాల్లో హీరోయిన్‌ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉండేలా జాగ్రత్తపడతాడు. అలాంటి దర్శకుడికి బేబమ్మ తొందరపడి నో చెప్పింది అంటున్నారు. అయితే నాని 'శ్యామ్‌ సింగరాయ్‌', సుధీర్‌బాబుతో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', రామ్‌ పోతినేనితో మరో సినిమాలో కృతీ హీరోయిన్‌ అని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు తమిళ చిత్రసీమలో ధనుష్‌ సరసన నటించనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే తెలుగులో మరో రెండు సినిమాలకు సంతకం చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో బేబమ్మ కాల్షీట్లు ఖాళీగా లేవు. ఈ క్రమంలో ఎంత గొప్ప పాత్ర అయినా ఎలా ఓకే చెప్పగలుగుతుంది.