చాలా కాలం తరువాత మరోసారి దర్శకుడిగా తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు డైరెక్టర్ తేజ. దగ్గుబాటివారి యంగ్ హీరో అభిరామ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. సినిమా చేస్తున్నాడు. ఈమూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది.
కథనే నమ్ముకున్న డైరెక్టర్లలో తేజ ఒకరు. ముఖ్యంగా కొత్త టాలెంట్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడీ దర్శకుడు. ఇప్పడు ఇండస్ట్రీలో స్టార్లు గా ఉన్న చాలా మంది హీరోలు, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది తేజానే. గత కొంత కాలంగా దర్శకుడిగా సక్సెస్ లులేక కామ్ గా ఉన్న తేజా.. త్వరలో అహింస సినిమాతో మరోసారి అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు.
ప్రస్తుతం ఓ కొత్త కాన్సెప్ట్ తో అహింస టైటిల్ తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు తేజ విభిన్న ప్రేమకథతో రూపొందుతోన్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి తమ్ముడు అభిరామ్ దగ్గుబాటి హీరోగా నటిస్తున్నాడు. ఈసినిమాతో ఆయన సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే స్టార్ట్ అయినా.. కరోనా కారణంగా ఇండస్ట్రీ స్థంబించిపోయి..ఎక్కడివి అక్కడ సినిమాలు ఆగిపోయాయి. దాంతో ఈ సినిమా కూడా పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. కాగా.. రీసెంట్ గా ఈమూవీ షూటింగ్ కు పేకప్ చెప్పుకున్నారు టీమ్. షూటింగ్ అంతా అయిపోయిందని గ్రూఫ్ ఫోటోకు పోజులు కూడా ఇచ్చారు.
షూటింగ్ పూర్తి చేసుకోవడంతో .. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు టీమ్. ఈ సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయడమే టార్గెట్గా పెట్టుకున్నారు. ఇక ఇప్పటి నుంచే వరుస అప్ డేట్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు తేజ. ముఖ్యంగా అభిరామ్ లుక్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నాడు. రీసెంట్ గా ఈమూవీ నుంచి అభిరామ్ కు సంబంధించిన ఫస్ట్ గ్లింప్ ను రిలీజ్ చేశారు టీమ్.

గతంలె అహింస సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రీ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు.. సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసింది.తాజాగా మేకర్స్ ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. అభిరామ్‌ను ఓ నలుగురు కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా.. తప్పించుకోవడానికి ప్రయత్నించగా పట్టుకుని రక్తం వచ్చేలా కొడతారు విలన్లు. అయితే ఈ గ్లిప్స్ లో... అభిరాన్ లుక్ ను పూర్తిగా రివిల్ చేయలేదు మేకర్స్.ఈ వీడియో సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో అభిరామ్‌కు జోడీగా గీతికా తివారి హీరోయిన్‌గా నటించింది. ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఆర్‌పీ పట్నాయక్ సంగీతం అందించాడు. మరోసారి ఆర్పీ పట్నాయక్ - తేజా కాంబినేషన్ మ్యాజిక్ చేయబోతున్నారు.
