పెళ్లిచూపులు సినిమాతో ఒక్కసారిగా ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శకుడు త‌రుణ్ భాస్కర్. ఆ సినిమాతో నేష‌న‌ల్ అవార్డ్ కూడా అందుకున్న తరుణ్  ఆ త‌ర్వాత ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చినా కూడా అది తీవ్రంగా నిరాశ ప‌రిచింది. దాంతో దర్శకుడుగా కొద్ది గ్యాప్ తీసుకుని, న‌టుడిగా  వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ బిజీ అవుతున్నాడు ఈయ‌న‌. రీసెంట్ గా విడుదలైన ఫ‌ల‌క్‌నుమా దాస్ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ చేసాడు త‌రుణ్ భాస్కర్. దాంతో పాటే మ‌రో రెండు మూడు సినిమాలు ఒప్పుకున్నాడు కూడా. 

అయితే ఆయన్ని దర్శకత్వంలో సినిమా చూడాలనేదే ఆయన అభిమానుల ఆశ. అది తరుణ్ కూడా గమనించినట్లున్నారు. త్వరలో తాను ఓ ఎక్సయిటింగ్ మూవీ చేయనున్నట్లు సోషల్ మీడియా సాక్షిగా హింట్ ఇచ్చారు తరుణ్ భాస్కర్. తన అఫీషియల్ ఇంస్టాగ్రామ్ ఎక్కౌంట్ ద్వారావేదికగా త్వరలో తాను చేయబోయే చిత్ర ప్రకటన రానుంది అన్నట్లుగా ఓ ఫొటో అప్ లోడ్ చేసారు.  గతంలో తరుణ్ భాస్కర్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఓ మూవీ చేయనున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో మరి ఈయన తాజా చిత్రాన్ని సురేష్ బాబు నిర్మిస్తారేమో మరెవరు నిర్మిస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది. 

ఇదిలా ఉంటే...మరో ప్రక్క తరుణ్ భాస్కర్ ఏకంగా హీరోగా మారుతున్నారు.తనను హీరోగా నిలబెట్టిన తరుణ్ భాస్కర్ ను హీరోను చేస్తూ విజయ్ దేవరకొండ సినిమా నిర్మిస్తున్నారు. విజయ్ తండ్రి నిర్మాతగా ఓ సినిమాను చాలా సైలెంట్ గా పూర్తి చేసేసారు. ఈ సినిమాకు కొత్త దర్శకుడు దర్శకత్వం వహించారు. ఈ సినిమా పూర్తయింది. త్వరలో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.