ఇస్మార్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్ తో దర్శకుడు సుశీంద్రన్ ప్రవర్తన వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈశ్వరన్ సినిమా ఆడియో లాంచ్ వేదికపై జరిగిన ఈ సంఘటన పలు విమర్శలకు దారితీసింది. సోషల్ మీడియా వేదికగా నెటిజెన్స్ సుశీంద్రన్ పై విరుచుకుపడ్డారు. దీనితో సుశీంద్రన్ ఈ ఘటనపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈశ్వరన్ మూవీలో నిధి అగర్వాల్ హీరో శింబూ వెంటపడే అమ్మాయిగా కనిపిస్తారు. మామా ఐ లవ్ యూ.. అంటూ నిధి, శింబు వెంట పడతారు. అందుకే వేదికపై నిధిని... శింబూ మామ ఐ లవ్ యూ... అని చెప్పాలని కోరినట్లు ఆయన చెప్పారు. అంతకు మించి మరో ఉద్దేశం లేదని సుశీంద్రన్ అన్నారు. 

ఈశ్వరన్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. దీనితో చిత్ర యూనిట్ ఆడియో వేడుక కార్యక్రమం నిర్వహించారు. ఈ ఆడియో లాంచ్ కార్యక్రమంలో నిధి అగర్వాల్ మాట్లాడడానికి వేదికపైకి వెళ్లడం జరిగింది. నిధి మాట్లాడుతుండగా వేదికపైకి వెళ్లిన సుశీంద్రన్ 'శింబు మామా ఐ లవ్ యూ' అనాలని కోరారు. దానికి నిధి అగర్వాల్ చెప్పనని సున్నితంగా తిరస్కరించారు. సుశీంద్రన్ ఈ విషయంలో నిధి అగర్వాల్ ని కొంచెం బలవంతం చేయడం వివాదాస్పదం అయ్యింది. 

సుశీంద్రన్ చర్యలకు నిధి అగర్వాల్ ఇబ్బంది పడ్డారు. ఈ ఘటనపై పూర్తి వ్యతిరేకత వ్యక్తం అవుతున్న తరుణంలో సుశీంద్రన్ వివరణ ఇచ్చారు. సంక్రాంతి కానుకగా ఈశ్వరన్ మూవీ విడుదల కానుంది. సీనియర్ దర్శకుడు భారతీరాజా కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చిడం జరిగింది.