ఏకకాలంలో మూడు చిత్రాలు పూర్తి చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న మెగా 154 చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. తాజాగా మెగా 154 మూవీ సెట్స్ ని దర్శకుడు సుకుమార్ సందర్శించారు. ఈ విషయాన్ని దర్శకుడు బాబీ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.  


ఆచార్య రిజల్ట్ చిరంజీవికి (Chiranjeevi) బిగ్ షాక్ ఇచ్చింది. తండ్రీ కొడుకులు హీరోలుగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆచార్య అంత పెద్ద డిజాస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. రామ్ చరణ్ నటించిన ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)థియేటర్స్ లో ఉండగానే తర్వాత విడుదలైన ఆచార్య వెళ్ళిపోయింది. రెండో రోజుకే ఆచార్య వసూళ్లు పడిపోవడం ఊహించని పరిణామం. ఇక జయాపజయాలను పట్టించుకోకుండా ఆచార్య విడుదల తర్వాత చిరంజీవి విదేశాలకు వెళ్లి వచ్చారు. ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే ఆయన షూటింగ్స్ లో బిజీ కావడం జరిగింది. 

ఏక కాలంలో భోళా శంకర్, గాడ్ ఫాదర్, మెగా 154 చిత్రాల చిత్రీకరణ ఆయన పూర్తి చేస్తున్నారు. మెగా 154వ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్ర ప్రీలుక్స్ ఆకట్టుకున్నాయి. చిరంజీవి మాస్ మేనరిజం 90లలో విడుదలైన మాస్ సూపర్ హిట్స్ ని తలపించింది. చిరంజీవి చేస్తున్న మూడు చిత్రాల్లో ఇది మాత్రమే స్ట్రెయిట్ మూవీ. మిగతా రెండు రీమేక్స్ గా తెరకెక్కుతున్నాయి. 

Scroll to load tweet…
Scroll to load tweet…

తాజాగా మెగా 154 సెట్స్ ని దర్శకుడు సుకుమార్ సందర్శించారు. దర్శకుడు బాబీ చిత్రీకరించిన కొన్ని రషెస్ సుకుమార్ కి చూపించారట. సుకుమార్ చాలా అనుభూతిని పొందారట. మెగా 154 రషెస్ చూశాక సుకుమార్ ఫీలింగ్ నేను ఎప్పటికీ మర్చిపోలేనని దర్శకుడు బాబీ తెలియజేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇక ఈ మూవీకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా శృతి హాసన్ నటిస్తున్నారు. 

ఇక దర్శకుడు మెహర్ రమేష్ భోళా శంకర్ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇది తమిళ హిట్ మూవీ వేదాళం రీమేక్. కొంత చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అలాగే మలయాళ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, దసరా కానుకగా విడుదలయ్యే అవకాశం కలదు.