Asianet News TeluguAsianet News Telugu

Pushpa 2: పుష్ప 2 కోసం చేసిన షూట్ మొత్తం వేస్టేనా?

పుష్ప చిత్రాన్ని ఒక పార్ట్ గానే స్టార్ట్ చేశారు. సినిమా మొదలయ్యాక పాన్ ఇండియా, పార్ట్ 2 ఆలోచనలు పురుడు పోసుకున్నాయి. ఈ క్రమంలో పుష్ప 2 కోసం చేసిన 70 శాతం షూటింగ్ పూర్తి చేశారు. అయితే ఆ చిత్రీకరణ మొత్తం వేస్ట్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

director sukumar to reshoot form beginning for pushpa 2
Author
Hyderabad, First Published Jul 4, 2022, 5:22 PM IST

పుష్ప సక్సెస్ దర్శకుడు సుకుమార్(Sukumar) ని అయోమయంలో పడేసినట్లు తెలుస్తుంది. పార్ట్ 2 ఎలా తీయాలనే సందిగ్ధత ఆయనలో మొదలైందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ముందుగా అనుకున్న స్క్రిప్ట్ మొత్తం మార్చేయడంతో పాటు రీ షూట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్ టాక్. హిందీలో పుష్ప విజయం ఊహించనిదే. మేకర్స్ కూడా పెద్దగా హోప్స్ లేవు. దీంతో కనీస ప్రమోషన్స్ కూడా చేయలేదు. ఈ కారణంగా పుష్ప బాలీవుడ్ లో మెల్లగా మొదలైంది. ఫస్ట్ డే ఈ చిత్రానికి కేవలం రూ. 3 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. 

వర్డ్ ఆఫ్ మౌత్ తో పుంజుకున్న పుష్ప(Pushpa) ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక వరల్డ్ వైడ్ పుష్ప రూ. 360 కోట్ల వసూళ్ల వరకు సాధించింది. ఇక పుష్ప పార్ట్ వన్ భారీ విజయం అందుకోగా, మరింత భారీగా పార్ట్ 2 తెరకెక్కించాలని భావిస్తున్నారు. పాన్ ఇండియా అంచనాలు అందుకునేలా బడ్జెట్ డబుల్ చేశారు. స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు కూడా చేశారని సమాచారం. ఈ క్రమంలో గతంలో పుష్ప 2 కోసం చేసిన చిత్రీకరణ పనికిరాకుండా పోయిందట. చిత్రీకరించిన సన్నివేశాలు ఉపయోగించరట. దీని వలన రూ. 30 కోట్ల రూపాయలు వృధా అయ్యాయి అంటున్నారు. 

నిజానికి మిగిలిన 30 శాతం షూటింగ్ పూర్తి చేసి 2022 చివర్లో పుష్ప 2 విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. మొత్తం రీ షూట్ చేసే ఆలోచన కారణంగానే పుష్ప 2 ఇంత వరకు సెట్స్ పైకి వెళ్ళలేదు. సుకుమార్ తన టీం తో కూర్చొని మేధోమథనం చేస్తున్నారట. ఇక 2023లో కూడా పుష్ప 2 విడుదలయ్యే ఆస్కారం లేదట. పుష్ప వచ్చేది 2024లోనే అంటున్నారు. ఇక పుష్ప 2 చిత్రానికి దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా, ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ చేస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios