భారీ అంచనాల మధ్య గత వారం రిలీజైన సాహో ఊహించని టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే. మొదట సినిమాకు రివ్యూలు నెగిటివ్ గా వచ్చాయి. అలాగే చాలా వరకు అభిమానులు అంచనాలకు తగ్గట్టుగా సినిమా లేదని నిరాశ చెందారు. ఇక ఫైనల్ మొదటి నాలుగు రోజులు సెలవులు ఉండడంతో సాహో 300కోట్లకు పైగా సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకుంది. 

ఇక దర్శకుడు సుజిత్ సినిమాపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అదే విధంగా తన మొదటి షార్ట్ ఫిల్మ్ 17 ఏళ్ల వయసులో తీశానని చెబుతూ.. క్రిటిసిజమ్ ఎల్లపుడు తనకు బూస్ట్ ఇచ్చిందనే చెప్పాడు. సినిమా చాలా మందికి నచ్చిందని అయితే ఎవరైతే అంచనాలకు మించి చేరలేదని అనుకుంటున్నారో వారు మరోసారి సినిమా చూస్తే తప్పకుండా ఎంజాయ్ చేస్తారని పేర్కొన్నాడు. 

అలాగే ఇన్నేళ్ల కెరీర్ లో ఏనాడు వెనక్కి తగ్గలేదని సాహో సినిమాలో మీరు మిస్ అయినా విషయాలు అర్ధం కావాలంటే మరోసారి చూడండని సుజిత్ ఇన్స్టాగ్రామ్ లో వివరణ ఇచ్చాడు. దీంతో ప్రభాస్ అభిమానులు అతనికి మద్దతుగా నిలుస్తూ సినిమా బాగుందని ప్రశంసిస్తున్నారు. నీల్ నితిన్ ముకేశ్ కూడా సుజిత్ హార్డ్ వర్క్ పై పాజిటివ్ గా సమాధానం ఇచ్చారు.