1970, 1980ల కాలంలో ఎన్నో హారర్ సినిమాలను తెరకెక్కించిన హారర్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు దర్శకుడు శ్యామ్ రామ్సే. 67 ఏళ్ల ఈ దర్శకుడు కన్నుమూశారు.

ముంబైలోని అంధేరీ ప్రాంతంలో జీవిస్తోన్న ఆయన ఆరోగ్యం సడెన్ గా పాడవ్వడంతో కుటుంబ సభ్యులు కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ
శ్యామ్ రామ్సే కన్నుమూశారు.

ఈ రోజు కుటుంబ సభ్యులు విలేపార్లేలో అంతిమక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మరణ తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడిగా ‘దో గజ్ జమీన్ కే నీచే’, ‘దర్వాజా’, ‘పురానా మందిర్’, ‘వీర్నా’, ‘పురానీ హవేలీ’, ‘తహల్కా’ ఇలా ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించారు.