Asianet News TeluguAsianet News Telugu

మంత్రి కేటీఆర్‌ పై శేఖర్ కమ్ముల కామెంట్ ఏంటంటే..

పదేండ్ల ముందుకు ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు సినిమాల్లో తెలంగాణ నేపథ్యం, యాస, భాష పెట్టకపోతే ఆ చిత్రాలు ఆడవేమో అనే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాక ముందు ఈ భాషను క్యారికేచర్‌లా, హాస్యాస్పదంగా, విలనిజానికి సింబల్‌గా కించపరచడం చూశాను. 

Director Shekhar Kammula about Telangana Language And KTR
Author
First Published Jun 4, 2023, 12:23 PM IST


‘ఇది మన తెలంగాణ సినిమా’ అని అందరూ గర్వంగా చెప్పుకొనే స్థాయికి చేరుకున్నామని శేఖర్ కమ్ముల అంటున్నారు.  తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని శేఖర్‌ కమ్ముల మీడియాతో  మాట్లాడారు. దశాబ్ద కాలంగా తెలంగాణలో జరిగిన అభివృద్ధి, సినీ రంగంలో చోటుచేసుకున్న మార్పుల గురించి ఆయన మాట్లాడుతూ కేటీఆర్ గురించి చెప్పుకొచ్చారు.
 
శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.... హైదరాబాద్‌ నగరం అద్భుతమైన అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. ఇంజినీరింగ్‌ చేసే సమయంలో అమెరికా జీవనవిధానం, అక్కడి విలాసవంతమైన సౌకర్యాలు చూస్తే చాలాగొప్పగా అనిపించేది. ఇప్పుడు హైదరాబాద్‌ కూడా ఆల్‌మోస్ట్‌ అమెరికాను తలపిస్తుంది. ఈ మార్పును నేను ప్రత్యక్షంగా చూశాను. ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో ఎక్కడా చూసినా నీళ్లు కనిపిస్తున్నాయి. మంత్రి కేటీఆర్‌ అందరికీ అందుబాటులో ఉండటం చాలాగ్రేట్‌. ప్రజల సమస్యల పట్ల ఆయన స్పందిస్తున్న తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది. ప్రభు త్వం అంటే ప్రజలకు దూరంగా ఎక్కడో ఉండేది కాదని, ప్రజలు కూడా ప్రభుత్వంలో భాగస్వాములనే రీతిలో కేటీఆర్‌ పనిచేస్తున్నారు. ఈ విషయంలో కేటీఆర్‌ను అభినందించాల్సిందే! అన్నారు.

 అలాగే ..పదేండ్ల ముందుకు ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు సినిమాల్లో తెలంగాణ నేపథ్యం, యాస, భాష పెట్టకపోతే ఆ చిత్రాలు ఆడవేమో అనే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాక ముందు ఈ భాషను క్యారికేచర్‌లా, హాస్యాస్పదంగా, విలనిజానికి సింబల్‌గా కించపరచడం చూశాను. ఇప్పుడు ఆ స్థాయి నుంచి తెలంగాణ నేపథ్యం, భాష మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమాగా అవతరించింది. క్రమక్రమంగా పుంజుకొని ఈ నేపథ్యంలో సినిమా చేస్తే బాక్సాఫీస్‌ సక్సెస్‌ అనే స్థాయికి వచ్చింది అని చెప్పుకొచ్చారు.

ఇక  ‘ఫిదా’ చిత్రాన్ని బాన్సువాడ నేపథ్యంలో తెరకెక్కించాం. ఈ సినిమా ద్వారా తెలంగాణ సంస్కృతి, ఆచారాలు, కుటుంబ జీవన విధానం ఎలా ఉంటాయో చూపించాలనుకున్నా. ప్రస్తుతం తెలంగాణ భాషతోపాటు గ్రామీణ తెలంగాణకు చెందిన కథలు సినిమాగా రావడం గొప్ప అచీవ్‌మెంట్‌. అర్బన్‌ సిటీ రొమాంటిక్‌ కథలు కాకుండా, మట్టివాసనతో తీసే పల్లె కథలు కూడా విజయం సాధిస్తాయనే నమ్మకం ఏర్పడింది. ‘ఇది మన తెలంగాణ సినిమా’ అని అందరూ గర్వంగా చెప్పుకొనేలా ఇక్కడి సినిమా ఎదిగింది. దీనిని తెలంగాణ సాధించిన గొప్ప సాంస్కృతిక విజయంగా అభివర్ణించవచ్చు అని అన్నారు.
 
అలాగే ఇంతకుముందు పల్లెటూరి నేపథ్యంలో సినిమా అనగానే కోనసీమలో షూటింగ్‌ చేసేవారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇక్కడ కూడా అందమైన లొకేషన్స్‌ వెలుగులోకి వచ్చాయి. ‘ఫిదా’ చిత్రీకరణ కోసం వెళ్లినప్పుడు బాన్సువాడలో లొకేషన్స్‌ చూసి షాక్‌ అయ్యాను. బ్యూటిఫుల్‌ జాగ్రఫీ తెలంగాణ సొంతం. ‘ఫిదా’ చిత్రంలో అమెరికాలో తీసిన సన్నివేశాల తెలంగాణలోని లొకేషన్స్‌నే చాలా అందంగా చూపించాను. కోనసీమ, గోదావరి అందాలను తలపించేలా తెలంగాణలో లొకేషన్స్‌ కనిపిస్తున్నాయి. ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తున్నది. ఏ పల్లెకు వెళ్లినా పండుగ వాతావరణమే దర్శనమిస్తున్నది.
 

Follow Us:
Download App:
  • android
  • ios