Asianet News TeluguAsianet News Telugu

న్యూస్ పేపర్ లో చూసి 'భారతీయుడు 2' కథ రాశా..రాంచరణ్ ని పొగుడుతూ గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇచ్చిన శంకర్

డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 చిత్రం జూలై 12న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో శంకర్, కమల్ హాసన్, ఇండియన్ 2 చిత్ర యూనిట్ ఇండియా మొత్తం తిరుగుతూ ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు.

Director Shankar Speech at Bharateeyudu 2 movie pre release event dtr
Author
First Published Jul 7, 2024, 10:55 PM IST | Last Updated Jul 7, 2024, 10:55 PM IST

డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన భారతీయుడు 2 చిత్రం జూలై 12న రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో శంకర్, కమల్ హాసన్, ఇండియన్ 2 చిత్ర యూనిట్ ఇండియా మొత్తం తిరుగుతూ ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. నేడు హైదరాబాద్ లో భారతీయుడు 2 చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

శంకర్, కమల్ హాసన్ తో పాటు ఈ చిత్రంలో నటించిన ఎస్ జె సూర్య, సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, సముద్రఖని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.. భారతీయుడు 2 తర్వాత న్యూస్ పేపర్స్ చూసిన ప్రతి సారి భారతీయుడు గుర్తుకు వచ్చేవారు. పేపర్ లో లంచం గురించి వార్త వచ్చేది. ఇలాంటప్పుడు భారతీయుడు వస్తే బావుంటుంది కదా అనిపించేది. కానీ కథ పూర్తిగా దొరకలేదు. 

2.0 చిత్రం తెరకెక్కిస్తున్న సమయంలో భారతీయుడు 2 కథకి సంబంధించిన ఐడియా వచ్చింది అని శంకర్ తెలిపారు. 28 ఏళ్ళ క్రితం భారాతీయుడు తీస్తున్నప్పుడు ఆ గెటప్ లో కమల్ హాసన్ ని చూస్తే ఎలాంటి గూస్ బంప్స్ వచ్చాయో.. ఇన్నేళ్ల తర్వాత ఆయన్ని అదే గెటప్ లో చూస్తే అంతకి మించిన గూస్ బంప్స్ వచ్చాయి అని శంకర్ అన్నారు. నా లాగే మీరు కూడా థియేటర్స్ లో గూస్ బంప్స్ ఫీలవవుతారు అని అన్నారు. 

కమల్ హాసన్ ఈ వయసులో కూడా నాలుగు రోజుల పాటు అంత భారీ మేకప్ వేసుకుని రోప్ లతో వేలాడుతూ నటించారు. ఇండియాలోనే కాదు ఈ వరల్డ్ లోనే ఆ విధంగా చేయగలిగే నటుడు ఆయన ఒక్కరే అని శంకర్ ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికి శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రసంగం చివర్లో శంకర్ రాంచరణ్ గేమ్ ఛేంజర్ అప్డేట్ ఇచ్చారు. 

రాంచరణ్ పోర్షన్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా త్వరలో పూర్తవుతుంది. త్వరలో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తాం అని అన్నారు. రామ్ చరణ్ స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉంటుంది అని శంకర్ ప్రశంసించారు. 

అనంతరం కమల్ హాసన్ మాట్లాడుతూ 50 ఏళ్ళ పాటుగా సాగుతున్న తన సినీ కెరీర్ ని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేను ఇంత స్టార్ అని అయ్యానంటే అందులో మీ పాత్రతో పాటు మీ తండ్రుల పాత్ర కూడా ఉందని అన్నారు. భారతీయుడు 2 తో పాటు భారతీయుడు 3 కూడా మిమ్మల్ని అలరిస్తుంది అని తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios